తెలుగు ఇండస్ట్రీలో మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి.. ఆ తర్వాత హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాజశేఖర్.. తన విలక్షణమైన నటనతో యాంగ్రీ యంగ్ మెన్ గా పేరు తెచ్చుకున్న ఈ సీనియర్ హీరో తన కెరీర్లో ఎంత వేగంగా అయితే టాప్ హీరోగా ఎదిగాడో.. అంతే వేగంగా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అదే సమయంలో తన ముందుకు వచ్చిన మంచి సినిమాలను వదులుకుని మరింత తప్పు చేశాడు. అలా రాజశేఖర్ వదులుకున్న హిట్ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 జెంటిల్ మెన్

డైరెక్టర్ శంకర్ మొదటి సినిమా ఇది. అర్జున్ హీరో గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు మొదట రాజశేఖర్ ను హీరోగా అనుకున్నారట. ఆ టైంలో రాజశేఖర్ బిజీగా ఉన్నారు. డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. దీంతో ఆ సినిమాను వదులకున్నాడు. ఆ తర్వాత అర్జున్ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

2 చంటి

వెంకటేష్ సినీ కెరీర్‌లో ఇదో బెస్ట్ మూవీ. నటుడిగా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తొలి ఆఫర్ కూడా రాజశేఖర్‌కే వచ్చింది. ఈ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే అనుమానంతో ఆయన వద్దు అనుకున్నాడు. దీంతో ఆసినిమా వెంకీ చేతికి వెళ్లింది. టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది.

3 ఠాగూర్

చిరంజీవి నటించిన ఈ సినిమా బాక్సీఫీస్ బద్దలు కొట్టింది. చిరు కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఆఫర్ కూడా ముందు రాజశేఖర్‌కే వచ్చింది. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల వద్దు అనుకున్నాడట. చివరకు చిరంజీవి చేసి సక్సెస్ అయ్యాడు.

4 నేనే రాజు నేనే మంత్రి

రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీ కథ తొలుత రాజశేఖర్‌కే చెప్పాడట దర్శకుడు తేజ. క్లైమాక్స్ మార్చాలని రాజశేఖర్ కోరాడట. అందుకు తేజ ఒప్పుకోలేదు..దీంతో ఆ అవకాశం మన దగ్గుబాటి రానా కి వరించింది.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..

అదే ఈ సినిమాల్లో రాజశేఖర్ కనుక నటించి ఉంటే కచ్చితంగా స్టార్ హీరో అయ్యేవాడని అంటూ ఉంటారు వారి సన్నిహితులు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here