ఈ రోజు దేశ ప్రజలందరూ 74వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకం ఎగరవేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ కి ఇస్మార్ట్ హీరో రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇచ్చిన సలహా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈమధ్య విజయవాడలోని స్వర్ణ. కోవిడ్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

అయితే హోట‌ల్ స్వ‌ర్ణ ప్యాల‌స్‌ ని ర‌మేశ్ హాస్పిట‌ల్ వారు కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చ‌కముందు, ప్ర‌భుత్వం అక్క‌డ క్వారంటైన్ సెంట‌ర్ నిర్వ‌హించింద‌ని, అప్పుడే ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగి ఉంటే ఎవ‌రిని నిందిస్తారు.? అంద‌రినీ ఫూల్స్‌ను చేయ‌డానికే ఈ విష‌యాన్ని అగ్ని ప్ర‌మాదం నుంచి ఫీజుల వైపు మ‌ళ్లిస్తున్నారా.? అని ప్ర‌శ్నించారు. స్వ‌ర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంట‌ర్ మేనేజ్‌ మెంట్ బాధ్య‌త‌ల‌ను స్వ‌ర్ణ ప్యాలెస్ యాజ‌మాన్య‌మే నేరుగా చూసుకుంటుంద‌ని, వారే బిల్లింగ్ చేస్తున్నార‌ని రామ్ తెలియజేస్తూ.. అందుకు సంబంధించిన స్వ‌ర్ణ ప్యాలెస్ బిల్లుల‌ను కూడా ఆయ‌న జ‌త చేశారు.

ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని త‌ప్పుగా చూపించ‌డానికి పెద్ద కుట్ర జ‌రుగుతుంద‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. “జ‌గ‌న్ గారూ.. మీ కింద ప‌ని చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్‌కి, మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ జ‌రుగుతుంది. వాళ్లను ఓ కంట కని పెడతార‌ని ఆశిస్తున్నాం.” అని రామ్ జ‌గన్‌కు ట్వీట్ చేశారు. ఆయ‌న ట్వీట్ వెనుక ఉద్దేశ్యం ఈ అగ్ని ప్ర‌మాదం సంఘ‌ట‌న‌లో ర‌మేష్ ఆసుప‌త్రి త‌ప్పేమీ లేదని చెబుతున్న‌ట్లుగా ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో హీరో రామ్ ఒక్కడే ఎందుకు స్పందించాడబ్బా.? అని ఆరా తీస్తే.. రామ్ కి ర‌మేష్ హాస్పిట‌ల్స్ అధినేత రమేష్ ద‌గ్గ‌రి బంధువని తెలిసింది. ప్రస్తుతం సోషల్.మీడియాలో బాగా సంచలనం సృష్టిస్తున్న హీరో రామ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసాడా.? అని రాజకీయ, సినీ వర్గాలలో పెద్ద చర్చాంశనీయమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here