Ravi Teja: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టినటువంటి తన ప్రయాణం అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ,హీరోగా సినిమా అవకాశాలను అందుకునే స్థాయికి వెళ్లారు.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతో ఉన్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకపోయినా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కొనసాగుతున్నటువంటి రవితేజ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ అందరి సరసన సినిమాలలో నటించారు.
ఇకపోతే తాజాగా రవితేజ ఈగల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.
అనుష్క నటన సూపర్..
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రవితేజకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇప్పటివరకు మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఇలియానా అనుష్క శ్రేయ త్రిష వంటి హీరోయిన్ల సరసన నటించారు అయితే వీరందరిలో మీకు ఏ హీరోయిన్ నటన అంటే ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది.. ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ తనకు అనుష్క నటన అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో విక్రమార్కుడు వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రాగ ఈ సినిమా తర్వాత బలాదూర్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.






























