నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాల పేర్లు వినిపిస్తే లవర్ బాయ్ సిద్దార్థ్ మన కళ్ల ముందు మెదులుతాడు. తెలుగులో ఈ రెండు సినిమాలు మినహా పెద్దగా సక్సెస్ లు లేని సిద్దార్థ్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు అభిమానిస్తారు. అయితే ఒకప్పుడు హిట్టూఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన సిద్దార్థ్ గత కొన్నేళ్లుగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

అయితే తాజాగా సిద్దార్థ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మహాసముద్రం సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏడేళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కిన బాద్ షా సిద్దార్థ్ చివరగా తెలుగులో నటించిన స్ట్రెయిట్ సినిమా. తమిళంలో సిద్దార్థ్ నటించిన సినిమాలే తెలుగులో డబ్ అవుతూ ఉండటంతో ప్రేక్షకులు లవర్ బాయ్ సిద్దార్థ్ ను ఇంకా మరిచిపోలేదు.

ఆర్.ఎక్స్.100 సినిమాతో తొలి సినిమాతోనే అజయ్ భూపతి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సిద్దార్థ్ కీలక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. అజయ్ భూపతి రవితేజతో మహాసముద్రం సినిమాను తెరకెక్కించాలని భావించినా కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. అయితే సిద్దార్థ్ ఎంట్రీతో ఈ సినిమా నుంచి సమంత ఎగ్జిట్ అయిందని తెలుస్తోంది.

గతంలో సిద్దార్థ్, సమంత ఒకరినొకరు ప్రేమించుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. శ్రీకాళహస్తిలో సామ్, సిద్దార్థ్ పూజలు చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అకస్మాత్తుగా సిద్దార్థ్ సామ్ విడిపోగా అనంతరం నాగచైతన్య సామ్ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే సిద్దార్థ్ మహాసముద్రం సినిమాలో నటించడం ఇష్టం లేని సామ్ తనంతట తాను తప్పుకుందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here