తమిళ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా హీరో శింబు కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచినా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఎలాంగో సలై రోడ్ లో మార్చి 18వ తేదీ రాత్రి 7 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల వృద్దుడు మృతి చెందాడు..

శింబు కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. కాగా ఈ ప్రమాదం సమయంలో కారులో శింబు తండ్రి డైరెక్టర్ టి రాజేందర్ ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే టి. రాజేందర్ వృద్దుడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే చనిపోయిన వృద్దుడు వికలాంగుడని అతను రోడ్డు పై పాకుకుంటూ వెళ్తుండటం కారులో ఉన్న డ్రైవర్ కు కనిపించలేదని చెబుతున్నారు.
Cctv footage of a differently abled man being run over by a car that belonged to actor Simbu’s father and director T Rajendran at T Nagar @TOIChennai pic.twitter.com/WBvveHkk54
— SINDHU KANNAN (@SindhukTOI) March 23, 2022
ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిన డ్రైవర్ సెల్వంను అక్కడి పోలీసులు అరెస్టు చేసారు. ఆపై జుడీషియల్ కస్టడీకి పంపించారు. అయితే తాజాగా ప్రమాదం జరిగిన చోట ఉన్న ఒక నివాసంలోCCTV కెమెరాల ఫూటేజ్ సేకరిచారు పోలీసులు ఇప్పుడు అది బయటకు రావడంతో ఆ వీడియో వైరల్ గా మారింది.






























