సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ లుక్ లో అదరహో అనిపించారు. టాలీవుడ్ హీరోలలో ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే నటుల్లో సుధీర్ బాబు ఒకరు. తొలి సినిమా శివ మనసులో శ్రుతి నుండి వి సినిమా వరకు జిమ్ బాడీతో కనిపిస్తూ లుక్ పరంగా సుధీర్ బాబు ఆకట్టుకున్నారు. ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చే సుధీర్ బాబు కష్టంగా ఉండే సరికొత్త వర్కవుట్లు చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఓ సీన్ షూటింగ్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సుధీర్ బాబు రెండు డంబుల్స్ పట్టుకొని వర్కౌట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సుధీర్ బాబు ట్విట్టర్ లో ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్న ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన వి సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా అనుకున్న స్థాయి ఫలితాన్ని అందుకోకపోయినా సుధీర్ బాబు నటనకు మంచి పేరు వచ్చింది. సినిమా ఇంట్రడక్షన్ లో సుధీర్ బాబు ఎంట్రీ సీన్ కు అభిమానులు ఫిదా అయ్యారు. సుధీర్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు అభిమానులను ఫిదా చేశాయి. తుపాకీ పట్టుకొని రౌడీలను చితక్కొట్టి సిక్స్ ప్యాక్ తో సుధీర్ బాబు అదరగొట్టాడు. అయితే అన్నీ ఉన్నా అదేదో అన్న విధంగా సుధీర్ కు కమర్షియల్ సక్సెస్ దక్కడం లేదు.

సుధీర్ హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి రెండు బ్లాక్ బస్టర్ హిట్లు నమోదైతే మిడిల్ రేంజ్ స్టార్ హీరోగా సుధీర్ బాబుకు గుర్తింపు దక్కే అవకాశం ఉంది.



























