Hero Suman : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ రజనీకాంత్ చేసిన వాఖ్యలే. ఎన్టీఆర్ శత జయంతి పుస్తక ఆవిష్కరణలో రజనీకాంత్ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధం అలాగే చంద్రబాబు సీఎ గా ఉన్న సమయంలో హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ చేసిన వాఖ్యలపై అధికార పక్షమైన వైసీపీ తీవ్రంగా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్ మీద ట్రోల్స్ మొదలు పెట్టింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయం గురించి సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరూ స్పందించకపోయినా హీరో సుమన్ మాట్లాడారు.

రజనీకాంత్ ను అనడానికి సిగ్గు లేదా…
వైసీపీ నేతలు రజనీకాంత్ ను విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయాల గురించి ఏమి మాట్లాడలేదు. వైసీపీ ప్రభుత్వం గురించి కానీ జగన్ పాలన గురించి కానీ ఏమాత్రం మాట్లాడలేదు. కేవలం ఎన్టీఆర్ గారి గొప్పతనం ఆయనతో రజనీకాంత్ కి ఉన్న అనుబంధం గురించి మాత్రమే మాట్లాడారు. అలాగే చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి మాట్లాడారు.

నిజాలనే చెప్పారు, ఎక్కడా మరొకరిని విమర్శించలేదు. అలాంటప్పుడు ఆయనని టార్గెట్ చేసి మాట్లాడటం రాజకీయాలు ఆపాదించడం ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు. నటుడికి ఒక రాష్ట్రం ఒక భాష కే పరిమితం కాదు. అన్ని భాషల్లోనూ తమ ప్రతిభ చూపించుకోవాలని అనుకుంటారు. అలాగే అన్ని భాషల వాళ్లకు దగ్గరవ్వుతారు అంటూ అభిప్రాయపడ్డారు సుమన్.