Hero Suman : తెలుగు వారికి వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు గుర్తొస్తే ఇప్పుడు మాత్రం సుమన్ గారే గుర్తొస్తారు. ఆయన నటించిన ‘అన్నమయ్య’ సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్రకు ప్రాణం పోశారు. తుళు కుటుంబానికి చెందిన హీరో సుమన్ మొదట తమిళ ఇండస్ట్రీలో ఓ మోస్తరు సినిమాలను చేసాక తెలుగు ఇండస్ట్రీలోకి కుడా అడుగుపెట్టారు. తెలుగులో మొదట ‘ఇద్దరు ఖిలాడీలు’ సినిమాతో మొదళు పెట్టి ఆ తరువాత తరంగిని, త్రివేణి సినిమాల్లో నటించారు. అయితే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది మాత్రం పెద్ద వంశీ గారి ‘సితార’ సినిమాతోనే. ఆ సినిమాలో సుమన్ గ్లామర్ కి అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక శోభన బాబు, కృష్ణం రాజు వంటి పెద్ద హీరోలతో కలిసి నటించిన సుమన్ గారు ఆయన నటనకు నంది అవార్డు కుడా అందుకున్నారు.

ఆయన ఎలా ఉంటారంటే…
సుమన్ గారు ఎన్టీఆర్ తప్ప మిగిలిన పెద్ద హీరోలతో దాదాపు నటించారు. ఇక ఎక్కువగా శోభన్ బాబు గారితో నటించిన ఆయన ఆయనతో మంచి అనుబంధం ఉందంటూ తెలిపారు. ఆయన డబ్బును ఎలా పెట్టుబడిగా మార్చాలి, ఆస్తులను ఎలా సంపాదించాలో ఎపుడూ చెప్పేవారు. చెన్నై లో ఎన్నో భూములు ఆయన అప్పట్లో కొన్నారు.

ఇప్పటికీ అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆయన చాలా ముందు చూపుతో భూమి విలువ పెరుగుతుందని అంచనాలు వేశారు అంటూ తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని చెప్పేవారని, నాకు ఆయన్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించారంటూ తెలిపారు. ఇక ఆయన కాస్ట్లీ గ్లాస్సెస్, పెర్ఫ్యూమ్ వేసుకుని చాలా క్లాస్ గా ఉండేవారని, ఆయన బట్టల స్టిచింగ్ కూడా స్టైల్ గా ఉండేదంటూ తెలిపారు. టైం ఖచ్చితంగా పాటించేవరని ఒక నిర్మాతకు డేట్స్ ఇస్తే ఆ డేట్స్ ఒకవేళ ఖాళీగా ఉన్నా ఇంట్లో కూర్చుంటారు కాని వేరే వాళ్ళకి సినిమా చేయరు అంత నిబద్ధతతో ఉంటారు అంటూ తెలిపారు.































