“బాలీవుడ్ ధోనీ” హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణవార్త యావత్‌ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. సుశాంత్‌ హఠాన్మరణాన్ని అటు సినీ ప్రముఖులు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియాలో సుశాంత్‌ చాలా యాక్టీవ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే అతను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన చివరి పోస్ట్‌ ప్రస్తుతం వైరలై నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది. 2002లో మరణించిన తన కన్నతల్లిని తల్చుకుంటూ హృదయం ద్రవించిపోయేలా కవితాత్మకంగా ఓ పోస్ట్ ను షేర్ చేశాడు పెట్టాడు సుశాంత్. సుశాంత్ కు వాళ్ళమంటే చాలా ఇష్టం. తీరిక సమయాలలో వాళ్ళమ్మపై సుశాంత్ చాలా కవితలు రాశాడు. అలా రాసిన కవితలలో.. సుశాంత్ చివరిగా షేర్ చేసిన పోస్ట్ ను మీరూ చదవండి.. అశ్రునయనాలతో సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్ధించండి.

మ‌స‌క‌బారిన‌ గతం…. కన్నీరుగా జారి ఆవిరవుతోంది.! అంతులేని క‌లలు….. చిరునవ్వును, శాశ్వతం కానీ ఈ జీవితాన్ని చెక్కుతున్నాయి.! ఆ రెండింటి మధ్య బతుకుతున్నా’

Instagram లో అమ్మ మీద సుశాంత్ రాసిన మ‌రికొన్ని క‌విత‌లు:

నువ్వున్నంత కాలం నేనున్నా
ఇప్పుడు నీ జ్ఞాపకాలతో బ‌తికున్న‌…..ఓ నీడ‌లా.!
అమ్మా నీకు గుర్తుందా…!? నువ్వు ఎప్ప‌టికీ నాతో ఉంటావ‌ని నాకు మాటిచ్చావు., ఎలాంటి స‌మ‌యాల్లోనైనా నేను న‌వ్వుతూనే ఉంటాన‌ని నీకు మాటిచ్చాను.!
కానీ ఇద్ద‌రం మాట మీద నిల్చోలేదు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here