Hero Vikram : తమిళ టాప్ హీరోల్లో ఒకరైన విక్రమ్ శివపుత్రుడు, అపరిచితుడు, వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో మల్లన్న, ఐ సినిమాలతో అలరించిన విక్రమ్ ఐ సినిమా తరువాత కొంత జోరు తగ్గింది. ఇక చియాన్ అని అభిమానులతో పిలిపించుకునే విక్రమ్ తనయుడు కూడా అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ తో ఇండస్ట్రీ కి పరిచయమాయ్యడు.

విక్రమ్ కి గుండె పోటు..వెంటనే హాస్పిటల్ కి తరలింపు…
56 సంవత్సరాల చియాన్ విక్రమ్ గుండెపోటుతో చెన్నై లోని కావేరి హాస్పిటల్ లో చేరాడు. రెగ్యులర్ గా వర్క్ అవుట్స్ చేస్తూ ఫిట్ గా ఉండే విక్రమ్ కు గుండె పోరు రావడంతో అభిమానులతో సహా, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఈరోజు సాయంత్రం విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా టీజర్ లాంచ్ లో పాల్గొనాల్సి ఉంది.

సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్లాన్ చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఐసీయూ లో ఉన్న విక్రమ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అభిమానులు, సినిమా ప్రముఖులందరూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


































