Hero Vishal : తమిళ హీరో అయినా తెలుగులో కుడా ఫ్యాన్ బేస్ తో ఉన్న హీరో విశాల్. పందెం కోడి, భరణి, డిటేక్టివ్, ఎనమీ, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక తమిళంలో సినిమాలతో మంచి గుర్తింపు ఉన్న విశాల్ సినిమా పరిశ్రమ కు ఉన్న సంఘం నడిగర్ రాజకీయాల్లో కూడా అంతే చురుగ్గా ఉంటూ నడిగర్ సంఘానికి అధ్యక్షుడు అయ్యాడు. సేవా కార్యక్రమాలు కూడా బాగా చేసే విశాల్ స్టార్ హీరో అయినా కూడా చాలా సింపుల్ గా జీవిస్తున్నాడు. తన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. ఇక విశాల్ తన సినిమాల కోసం కూడా అలాగే కష్టపడుతారు. డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుంటారు.

షూటింగ్ లో తీవ్ర గాయలతో హాస్పిటల్ లో విశాల్…
ఇటీవలే ఒక నెల క్రితం లాఠీ సినిమా షూటింగ్ లో గాయలపాలై విశాల్ ఆసుపత్రి కి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లో గాయపడ్డాడు. మార్క్ ఆంటోనీ సినిమా లో నటిస్తున్న విశాల్ డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలను చేసారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం తెల్లవారుజామున తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే షూటింగ్ కి బ్రేక్ తీసుకుని ప్రథమ చికిత్స అందించిన సిబ్బంది ఇక ఆ తరువాత ఆయనను ఆసుపత్రి కి తీసుకెళ్లారు.

#ActorVishal got severely injured early this morning
— Rinku Gupta (@RinkuGupta2012) August 11, 2022
He was filming a rigorous fight sequence for his movie #MarkAntony
Awaiting more updates…
Breaking News !!
— Vishal Fans 24×7 ™ (@VishalFans24x7) August 11, 2022
Our Puratchi Thalapathy #Vishal Anna got severely injured early this morning while filming a rigorous fight sequence for the movie #MarkAntony.@VishalKOfficial @HariKr_official
మార్క్ ఆంటోనీ సినిమా షూటింగ్ ను కొద్దిరోజులు వాయిదా వేశారు. వరుసగా ఇలా విశాల్ గాయలపాలవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 2014 నుండి వరుసగా సినిమా షూటింగ్లలో విశాల్ గాయపడుతూనే ఉన్నాడు. దీనికి ముఖ్య కారణం విశాల్ తన సినిమాల్లో యాక్షన్ సన్నివషాల్లో డూప్ లేకుండా నటించడమే.




























