చాలాకాలం తర్వాత “చక్ర” చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్టార్ హీరో విశాల్‌ని ఓ మహిళ మోసం చేసిన సంఘటన లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. దీంతో విశాల్ ప్రొడక్షన్ కంపెనీ మేనేజర్ ఆమెపై పోలీసులకు కంప్లైంట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. హీరో విశాల్ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్న ఒక మహిళా గత 6సంవత్సరాలలో కోట్ల రూపాయలను దోచుకున్నట్లు తెలిసింది. ఈమధ్య కాలంలో ఆమె రూ. 45 లక్షల విలువైన ఇల్లు కొనడంతో ఈ మోసం బయట పడింది. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే, మరోవైపు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ కింద ఈ హీరో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ కంపెనీ మేనేజర్ హరి చెన్నైలోని వడాపలాని పోలీస్ స్టేషన్‌లో తమ కంపెనీలో గత ఆరేళ్ళ నుండి పనిచేస్తోన్న ఓ మహిళా ఉద్యోగి చాలా సార్లు కంపెనీని తప్పుదోవ పట్టించి డబ్బులను తీసుకుందని, ఈమధ్యనే ఆ మహిళ 45లక్షలతో కొత్త ఇల్లు కొన్నదని, తమ కంపెనీని నుంచి దొంగిలించిన డబ్బుతోనే ఆమె ఆ ఇంటిని కొనుగోలు చేసిందని విశాల్ ప్రొడక్షన్ హౌస్ మేనేజర్ రాజా సదరు మహిళపై కంప్లైంట్ చేశారు.

ఇక ఈ కంప్లైంట్ ను విరుగమ్‌బక్కమ్ స్టేషన్‌కు ఫార్వర్డ్ చేసినట్లు వడపలాని ఎస్సై తెలిపారు. ఇక విశాల్ సినిమా విషయానికి వస్తే.. చక్ర సినిమా త్వరలో ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా.. సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.



























