టాలీవుడ్ టాప్ హీరోయిన్ చార్మి ఈమధ్యనే నిర్మాతగా మారారు. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే చార్మి అంటే చాలామందికి ఆమె హాట్ హీరోయిన్ అనే అనుకుంటారు. కాని.. చార్మి రియల్ లైఫ్ స్టోరీ వింటే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. ఏడో తరగతి చదువుతున్నప్పుడే ఏమీ తెలియని వయసులో కుటుంబ భారం మోయాల్సిన పరిస్థితిలో సినీరంగంలోకి అడుగు పెట్టిన ఛార్మి..

ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా, సైడ్ డాన్సర్‌గా సీరియల్స్ నటిగా ఆరోజుల్లో కేవలం రూ. 200 రెమ్యునరేషన్‌కి నటించిన ఛార్మి.. 13-14 ఏళ్ళకే ఊహించని విధంగా హీరోయిన్ అయ్యింది. ఇటీవల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఛార్మి ఎలాంటి కష్టాలను అనుభవించి హీరోయిన్‌గా ఎలా స్థిరపడింది? తిరిగి ఆమె కెరియర్ ధీనస్ధితిలో ఉన్నప్పుడు విధి ఆమెతో ఎలా ఆడుకుందో తెలియజేసింది. రియల్ లైఫ్ లో ఛార్మి ఎదుర్కొన్న ఇబ్బందులేమిటో మీరే చదవండి.

“నేను అనుకోకుండానే సినిమా రంగంలోకి వచ్చాను. మా నాన్న గారు పెద్ద బిజినెస్ మ్యాన్. ఫైనాన్సియల్ గా బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ మాది. అయితే ఆయకు సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన అనారోగ్యంతో కొంతకాలం మంచం పట్టారు. ఆ టైంలో మా కుటుంబమంతా రోడ్ మీదికి వచ్చినంత పనైంది. ఫైనాన్సియల్ గా చాలా చితికిపోయాం. ఆ టైంలో నాకు సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. రోజుకి రూ. 200 చొప్పున ఇస్తాం.. జూనియర్ ఆర్టిస్ట్‌గా చేయాలన్నారు. అప్పుడు ఆ రూ. 200 నాకు బ్రహ్మాండంగా కనిపించాయి. జూనియర్ ఆర్టిస్ట్‌గా సంపాదించే ఆ 200 రూపాయిలతో ఆనందంగా వుండొచ్చు అనిపించింది. సరిగ్గా ఆ టైంలోనే నేను 7వ తరగతి పాసై, 8వ తరగతికి వెళ్లాలి. 7వ తరగతిలో వుండగా సమ్మర్ సెలవులు ఇచ్చారు. బొంబేలో హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్‌ల సినిమా షూటింగ్ జరుగుతుంది. దానికి మెహబూబ్ స్టుడియోకి నన్ను తీసుకు వెళ్లారు. నేను వెళ్లేసరికి అక్కడ చాలామంది జూనియర్ ఆర్టిస్ట్‌లున్నారు. అంత మందిలో నన్ను పిక్ చేసి.. అభిషేక్ బచ్చన్ వెనకాల కూర్చోబెట్టి ఒక షాట్ తీశారు. షాట్ అయిన తరువాత అభిషేక్ బచ్చన్ టచ్ అప్ అవుతూ అద్దంలో నన్ను చూశారు. నువ్ చాలా అందంగా ఉన్నావు.. నువ్వెందుకు హీరోయిన్ కాకూడదని అన్నారు.

అభిషేక్ బచ్చన్ గారి ఆ ఒక్క మాటతో నేను హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించాను. సీరియల్స్ లో కూడా యాక్ట్ చేశాను. బ్యాక్ డాన్సర్ గా కూడా పని చేశాను. ఫైనాన్సియల్ గా స్థిరపడటం కోసం చాలా పనులు చేశాను. నాకు 13-14 ఏళ్లు వచ్చే సరికి పేరెంట్స్ దగ్గరకు వెళ్లి నేను హీరోయిన్ అవుతానని చెప్పాను. అప్పుడు మా ఫాదర్ నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఆయనే ఆడిషన్స్‌కి తీసుకువెళ్లేవారు. కాని నేను ఆ టైంలో చాలా స్ట్రగుల్ అనుభవించాను. నేను ఆడిషన్స్‌కి వెళ్లడం, రిజెక్ట్ కావడం ఇలా చాలా జరిగాయి. ఈవిధంగా అష్ట కష్టాలు అనుభవించిన తర్వాత ‘నీ తోడు కావాలి’ చిత్రంలో తొలిసారి హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. హైదరా బాద్ వాళ్లే పిలిచారు.. వాళ్లే టికెట్ ఇస్తున్నారు.. స్టే అండ్ ఫుడ్ కూడా వాళ్లే పెడతారు.. ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తారు. అయితే అయ్యింది లేదంటే లేదనుకుని నేను, మా నాన్న సూట్ కేస్ సర్దుకుని హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాం. ఫస్ట్ సినిమా ఒక నెల షూటింగ్ అన్నారు.. మా మైండ్‌లో అయితే మేం ఈ నెల చేసుకుని వెళ్ళిపోతామనే అనుకున్నాం. కాని ఆ ఒక్క నెలలోనే మా జాతకమంతా మారిపోయింది. చాలా మంది ప్రొడ్యుసర్స్ రావడం వాళ్లే మేనేజర్‌ని పెట్టించడం. చాలా ఆఫర్స్ రావడం జరిగాయి. అక్కడ నుంచి మళ్లీ ఇంటికి వెళ్లడమనేది జరగలేదు. షూటింగ్స్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి.

నా లైఫ్‌లో విజయాలు, అపజయాలు ఉన్నాయి. అయితే అపజయం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కెరియర్ స్టార్టింగ్‌లో నాకు అర్ధం కాలేదు. ఎందుకుంటే నాకు ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ నా చేతిలో 4,5 సినిమాల ఆఫర్లు ఉండేవి. అప్పటికి నా వయసు 16 వుండటం వలన కెరియర్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది పెద్దగా పట్టించుకోలేదు. లేవాలి.. షూటింగ్‌కి వెళ్లాలి.. ఇంటికి వచ్చేయాలి అని మాత్రమే అనుకునేదాన్ని. ఒకానొక సందర్భంలో నేను షూటింగ్ లో ఉన్నప్పుడు మీ సినిమా విడుదలైంది చాలా బాగుంది అని చెప్పేవారు.. అప్పుడు ఓహో నా సినిమా విడుదలైందన్నమాట.. అనుకునేదాన్ని. అప్పుడు పెద్దగా ప్రమోషన్స్ కూడా ఉండేవి కాదు. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న టైంలో సడెన్ గా నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. వాటిని మీడియాలో రకరకాలుగా రాసుకొచ్చారు. ఆ టైంలో నేను హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ‘పౌర్ణమి’ సినిమా అప్పుడైతే నాకు ఆక్సిడెంట్ అయ్యింది. కాని ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఎవరికీ చెప్పలేదు. కేవలం నా క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు. నేను 8 నెలల పాటు బెడ్ మీదే ఉన్నాను. వీల్ చైర్‌లో ఉండేదాన్ని. డాక్టర్స్ అయితే నువ్ జీవితంలో తిరిగి నడవలేవు అని చెప్పేశారు. నా కెరియర్ పీక్స్‌లో ఉండి.. చిన్న వయస్సులో ఇలా జరగడం వల్ల మళ్లీ చాలా కష్టాలు పడ్డాం. కమిట్ అయిన సినిమాలకు అడ్వాన్స్ రిటర్న్ చేశేశాం. హైదరా బాద్ లోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో నేను ట్రీట్ మెంట్ తీసుకుంటుంటే మీడియాలో నా గురించి బ్యాడ్‌గా రాశారు. అసలు నాకు ఏం జరిగింది? నేనేం కోల్పోయానో ఆ రాసిన వాళ్లకు కూడా తెలియదు. నా ఎడమ చేయి, ఎడమ కాలు 8 నెలల వరకూ పని చేయలేదు. 2006-08 పిరియడ్‌లో నా కెరియర్ పీక్స్‌లో ఉండగా.. ఈ యాక్సిడెంట్ జరిగింది. కోలుకోవడానికి చాలా టైం పట్టింది.
హైదరాబాద్ హాస్పటల్‌కి నన్ను వీల్ చైర్ మీద తీసుకుని వెళ్తున్నారని బయట చాలా దారుణంగా రాశారు. శరీరంపై గాయాలతో నేను చాలా బాధపడుతున్నానని నా పేరెంట్స్‌కి తెలుసు. ఈ రాతల వల్ల నేను మానసికంగా కూడా బాధపడతానని అర్ధం చేసుకుని ఆ టైంలో నాకు బయట ప్రపంచం తెలియకుండ చేశారు. నన్ను నా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ టైంలోనే తిరిగి ఆర్ధిక సమస్యలు మొదలయ్యాయి. కాని వాటిని తెలియనివ్వలేదు నా పేరెంట్స్. సంవత్సరం తర్వాత నేను కోలుకున్నాను. జర్మనీ నుంచి వచ్చిన ఓ డాక్టర్ నన్ను చూసి.. జర్మనీ రా నీకు ట్రీట్మెంట్ చేస్తా అన్నారు. నా దగ్గర డబ్బుల్లేవని చెప్పాను.. అప్పుడు ఆయన నాకూ నీలాంటి కూతురు ఉంది. నేను చూసుకుంటాను ఫర్లేదు అన్నారు. దేవుడే ఆ దేవ దూతను నా దగ్గరకు పంపినట్టు ఆ జర్మనీ డాక్టర్‌ని నా దగ్గరకు పంపించారనిపించింది. ఆ డాక్టర్‌కి ఇద్దరు కూతుళ్లు, వైఫ్ ఉన్నారు. నన్ను జర్ననీలోని ఆయన ఇంటికి తీసుకుని వెళ్లి నాకు ఫ్రీగా ట్రీట్ మెంట్ ఇచ్చి.. నన్ను మామూలు మనిషిని చేసి పంపించారు. ఆయన వల్లే నేను కోలుకోగలిగాను’ అంటూ తన లైఫ్‌లో జరిగిన విషయాల్ని షేర్ చేసుకుని ఎమోషనల్ ఫీలయ్యారు చార్మి. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మరో విషాదకరమైన సంఘటన ఏమిటంటే.. తాజాగా తనకెంతో ఇష్టమైన ఆంటీ అనారోగ్యంతో కన్ను మూయడంతో
“నువ్వుె లేని లోటు తీర్చలేనది. నా ప్రియమైన ఆంటీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ ఎంతో ఎమోషనల్ ఫీలైంది ఛార్మి. ఈ సందర్భంగా తనకిష్టమైన ఆంటీ మరణించడంతో ఆమెతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆమెతో వీడియో కాల్ మాట్లాడిన సంగతులను పంచుకుంది. విధికి ఎవరైనా తల వంచక తప్పదంటూ వేదాంత ధోరణీలో తన మనో వేదనను తెలియజేసింది.



























