నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ చిత్రం ద్వారా 1985లో తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వ గోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారు, గేమ్ వంటి తెలుగు చిత్రాలలో నటించింది. తెలుగుతోపాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది. 1980వ కాలంలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు.

అందంలోను నటనలోనే కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న అధ్భుత నటి శోభన. ఆమె చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీలో శిక్షణ పొందినది. ఆమె గురువు పేరు చిత్రా విశ్వేశ్వరన్ . భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శిండంలో ఆమె దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు. 1994లోనే శోభన కళార్పణ అనే సంస్థకు అంకురార్పణ చేసింది.

మళయాళీ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన శోభనకు యాభై ఏళ్ళొస్తున్నా ఆమె ఇంకా పెళ్ళి చేసుకోకుండానే వుండటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే కాకుండా మరేదో వ్యక్తిగత విషయాన్ని గోప్యంగా వుంచినట్టు సందేహమొచ్చి ఈమథ్యనే మీడియా ఇదే విషయాన్ని శోభన దగ్గర ప్రస్తావించగా.. ఆమె గతంలో ఓ మళయాళ హీరోని ప్రేమించిందని.. ఆ హీరో పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇక జీవితంలో పెళ్ళే చేసుకోకూడదని కఠినంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారామె. నేటికీ ఒంటరిగానే జీవిస్తున్న శోభన ఓ పాపను దత్తత తీసుకుని ఆ చిన్నారి ఆలనాపాలనా చూసుకుంటూనే కాలం గడిపేస్తుంది. ఇటీవలే దుల్కార్ సల్మాన్ హీరోగా నటించిన వారనే ఆవశ్యముందే చిత్రంలో అతిధి పాత్రలో తళుక్కున మెరిశారు శోభన. నాటి నుండి నేటి వరకూ విధి ఆడే వింత నాటకంలో చిత్రపరిశ్రమలోని కధానాయికల విఫల ప్రేమకధలకు లోటుండదనడానికి నటి శోభన జీవితమే నిదర్శనమేమో..?!




























