Actress: సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో ఎన్నో కలలు కంటూ ఇండస్ట్రీలోకి వస్తారు అయితే ఆ కలలు కొంతమందికి కలలుగానే ఉంటాయి అలాంటి సమయంలో కొన్నిసార్లు పిచ్చి ఆలోచనలు చేస్తూ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు అవకాశాలు లేక సూసైడ్ చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఉన్నారని తెలుస్తోంది.

ప్రముఖ ఫ్యామిలీ హీరో జగపతిబాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో 2001లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గజాల. అనంతరం వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నారు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
ఇలా తన కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే గజాల 2002వ సంవత్సరంలో సూసైడ్ అటెంప్ట్ చేశారు.2002 జూలై 22న హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రశాంత్ కుటీర్ అనే అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన తోటి నటీనటులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.
ఇలా గజాల సూసైడ్ చేసుకోవడానికి ప్రేమ వ్యవహారమే కారణం అంటూ వార్తలు వచ్చాయి. అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె హిందీ టీవీ నటుడు ఫైజల్ రజా ఖాన్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన గజాలా.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో ఈమెకు సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికి తెలియడం లేదు.



























