భారతీయ సినిమా చరిత్రలో సావిత్రికి ఒక ప్రత్యకమైన స్థానం ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ముఖంలో హావభావాలు పలికించడంలో, కళ్ళతో అభినయించడంలోను ఆమెకు ఆమె సాటి. మహానటి సావిత్రిలాంటి మరో నటి ఇండస్ట్రీకి దొరకడం మహాకష్టం. అందుకే ఆమె మహానటి అయింది. మహానటి సావిత్రి పాత్రలో నటించడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో అనుభవం ఉండాలి. అప్పుడే మహానటి పాత్రకు కొంతమేరకైనా న్యాయం చేస్తారు.

పెద్దగా అనుభవం లేని కీర్తి సురేష్ మహానటి పాత్రకు ఎంపిక కావడంతో.. ఆమెపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. కీర్తి సురేష్ ఆ పాత్రకు ఎంతమేరకు న్యాయం చేయగలదనే అనుమానాలు కూడా సంచలనం సృష్టించాయి. సావిత్రి పాత్ర కోసం కీర్తి సురేష్ ను ఫోటో షూట్ చేసినపుడు ఆమె అచ్చు సావిత్రిలా ఉండటంతో సావిత్రి పాత్రకు కీర్తిని సెలెక్ట్ చేశారు. కానీ సినిమా ఆరంభంలోనే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న కీర్తిని నాగ్ అశ్విన్ ప్రోత్సాహించడంతో ఆమెకు దైర్యం వచ్చింది. ఇక సినిమా విడుదలైన తర్వాత కీర్తి తన నటన విషయంలో సావిత్రిలాగ ఎంతవరకు మెప్పిచిందనే సంగతి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. ఆ తర్వాత కీర్తి స్టార్ హీరోయిన్ గా ఎంతగా ఎదిగిపోయిందో తెలిసిందే.! ఇదంతా ప్రక్కన పెడితే.. మహానటిలో నటించినందుకు కీర్తి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నదో తెలుసా.. ఏకంగా కోటి యాభైలక్షలు.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సినిమా కాబట్టి కీర్తి సురేష్ కు అంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చారని టాలీవుడ్ సమాచారం. ఆ విధంగా ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్న కీర్తి ప్రస్తుతం వరసగా వస్తున్న సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఈమధ్య కాలంలో కీర్తి నటించిన కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నా లాక్‌డౌన్ కారణంగా విడుదలవ్వలేదు. లాక్ డౌన్ నేపధ్యంలో సినిమా ధియేటర్స్ మూతపడిన కారణంగా ఓటిటి ప్లాట్ ఫామ్‌లోనే కీర్తి సురేష్ సినిమాలు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కార్తిక్ దర్శకత్వంలో కీర్తి నటించిన పెంగ్విన్ సినిమాను కూడా జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. పెంగ్విన్ తో పాటు కీర్తి తెలుగులో నితిన్ రంగ్ దే అనే సినిమా కూడా చేస్తుంది. వరుస ఆఫర్లతో తమిళ, హిందీ సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది కీర్తి సురేష్. ఇంతకీ ఇంత బిజీగా ఉన్న కీర్తి సురేష్ తాను నటించిన సినిమాలకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా..?

ఒక్కొక్క సినిమాకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది కీర్తి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలైతే కోటిన్నర వరకు తీసుకుంటుందని ఇండ్రస్ట్రీ టాక్. కేవలం హీరోయిన్ పాత్ర అయితే కోటి తీసుకుంటుందని సమాచారం. ఇంత భారీగా పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు ఈమె సినిమాలను నేరుగా ఓటిటిలో విడుదల చేసి సొమ్ము చేసుకుంటున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇక కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్‌తో పాటు మరికొన్ని రోజుల్లో మిస్ ఇండియా సినిమాను కూడా ఓటిటిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. మొత్తానికి మన మహానటి ఓటిటి క్వీన్ కావడమే కాకుండా కోటితారగా కూడా సంచలనాలు సృష్టిస్తుందన్నమాట.



























