చెప్ప‌ద‌ల‌చుకున్న విషయాన్ని సుత్తి కొట్టకుండా సూటిగా, స్ప‌ష్టంగా చెప్పడం ప్ర‌ముఖ సినీ న‌టి ఖుష్బూ ధైర్యానికి నిదర్శనం. తెలుగు సినీ న‌టిగా ఆమె టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుప‌రిచితురాలే. ఈమధ్య త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కాంగ్రెస్ త‌ర‌పున ఆమె చాలా యాక్టీవ్‌ గా ఉంటున్నారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ.. సంచలన కామెంట్స్ చేస్తూ.. ఒక్కొక్కసారి వివాదస్పదమైన అంశాలతో తనదైన శైలిలో ముందుంటూ ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతున్నారు.

తాజాగా భారత ప్ర‌ధాని నరేంద్ర మోడీపై త‌నదైన శైలిలో వెట‌కారాన్ని జోడించి సినీనటి ఖుష్బూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఖుష్బూ చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. రాముడి కంటే మోడీ పెద్ద‌వాడైపోయార‌ంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఖుష్బూ షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అయోధ్య రాముని ఆలయ నిర్మాణ శంకుస్థాపన బ్రహ్మాండంగా జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా తక్కువ మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వందల సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలియ జేశారు. ఆలయ నిర్మాణ శంకుస్థాపన జరగడంతో తమ కల నిజమైనందుకూ దేశ ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోడీని దేశంలోనే యుగ పురుషుడిగా వర్ణిస్తూ మోడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం హిందువుల కల నెరవేరుస్తున్న మోడీని హీరోగా పిలుస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ భారత ప్రధాని నరేంద్ర మోడీఫై సంచలన కామెంట్స్ చేయడం హాట్ టాపికైంది. బీజేపీ ఎంపీ శోభ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘బాల రాముడి చేతిని అందిపుచ్చుకొని మందిరం వైపు మోడీ నడిపిస్తున్న చిత్రం’ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి తన ప్రియమైన రాజును ఇంటికి తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆ చిత్రాన్ని గమనించిన కుష్బూ ‘వావ్.. ఇప్పుడు దేవుడైన రాముడి కంటే మోడీ పెద్దవారై పోయారన్నమాట. కలియుగ ప్రభావం మరి..’ అనే భావం వచ్చేలా వెటకారంగా సెటైర్ వేసింది. దీంతో ఒక్కసారిగా నరేంద్ర మోడీ ఫ్యాన్స్ ఖుష్బూఫై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here