తెలుగు టీవీ పరిశ్రమలో ఎంత మంది యాంకర్ లు ఉన్నా అత్యంత గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ మాత్రం ప్రదీప్ మాచిరాజు ఒక్కడే. బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక ట్రెండ్ సెట్ చేసుకున్న యాంకర్. ఫిమేల్ యాంకర్ల హవా నడుస్తున్న తరుణంలో మేల్ యాంకర్ గా వచ్చి, తెలుగు ప్రేక్షకులలో ముఖ్యంగా యూత్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు.

ప్రదీప్ ఈరోజు ఒక సక్సెస్ ఫుల్ యాంకర్ అయ్యుండచ్చు కాని ఒక సక్సెస్ ఫుల్ యాంకర్ గా నిలదొక్కుకోడానికి మాత్రం చాలా కష్టపడ్డాడు. ప్రదీప్ అంత సులభంగా ఏమి యాంకర్ కాలేదు. కెరీర్ మొదట్లో రేడియో జాకీగా పనిచేసిన ప్రదీప్. ఆ తరువాత కొన్ని లోకల్ చానల్స్ కి ప్రదీప్ యాంకర్ గా పని చేశాడు. లోకల్ చానెల్స్ కే కాక కొన్ని ఈవెంట్స్ కి కూడా యాంకర్ గా వ్యవహరించేవాడు. ప్రదీప్ తన TV షో ల కోసం ఖరీదైన మరియు బ్రాండ్ దుస్తులు ధరిస్తాడు. అయితే షో అయిపోయిన వెంటనే అందరిలా ప్యాక్ చేయించి ఇంటికి పట్టుకెళ్ళకుండా ఆ బట్టలని వేలం వేసి అమ్మేస్తాడు. వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బుని అతను అనాధ శరణాలయాలు మరియు సామాజిక సేవా సంస్థలకి విరాళంగా ఇచ్చేస్తాడు.

అయితే బుల్లి తెరపై ఎనర్జిటిక్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అయన హీరోగా వస్తున్న చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా “. తాజాగా సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న ప్రదీప్ కు ఒక హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేసింది. ప్రదీప్ యాంకర్ గా హోస్ట్ చేస్తున్న “ఢీ” షో చాలా పాపులర్ అయింది. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ టీవీ షోలో సుదీర్ తో కలిసి ప్రదీప్ పండించే కామెడీ కోసం ప్రత్యేకంగా ఈ షోని చూసేవాళ్ళు ఉన్నారు అంటే ప్రేక్షకుల్లో ప్రదీప్ కి ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా ఢీ షో లేటెస్ట్ ప్రోమో ఒకటి రిలీజ్ చేసారు. ప్రదీప్ కొత్త సినిమాలో మొన్న రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న “నీలి నీలి ఆకాశం…” అనే పాట ప్లే చేస్తుండగా… షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ మోకాళ్లపై కూర్చొని పువ్వులు అందిస్తూ ప్రదీప్ కు లవ్ ప్రపోజ్ చేసినట్టుగా ఉంది. ఇదే ప్రోమోలో కంటెస్టెంట్ చేసిన డాన్స్ నచ్చడంతో వెంటనే వెళ్లి అతని బుగ్గ కొరికింది. అయితే ఇదంతా షో కోసమే చేసింది అనుకోండి. హీరోయిన్ పూర్ణ ఇది వరకు కూడా ఇలాంటివి చాలానే చేసింది. ఒక కంటెస్టెంట్ రాజు వెలికి ఉంగరం తొడిగి ఎంగేజ్మెంట్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

courtesy @ ETV

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here