హీరోయిన్ నగ్మా…. ఈమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఎందుకంటే 90 దశాబ్దంలో తన గ్లామరస్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ నగ్మా డిసెంబర్ 25 1974 సంవత్సరంలో జన్మించింది. ఈవిడ అనేక హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. మొదట్లో ఈవిడ బాలీవుడ్లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి భారీ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. నగ్మా దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలో పనిచేసింది అనవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, భోజ్ పూరి, మరాఠీ, పంజాబీ ఇలా అనేక భాషల్లో నటించిన ఏకైక హీరోయిన్ నగ్మా.

ఈమె కుటుంబ విషయానికొస్తే వీరి కుటుంబం జైసల్మేర్ రాజరికం నేపథ్యం గల పూర్వికులు కుటుంబానికి చెందినవారు. ఇక నగ్మా తల్లి మహారాష్ట్రకు చెందిన కొంకణ్ ప్రాంతానికి చెందినది. ఆమె అప్పట్లో కాజీ స్వాతంత్రోద్యమ కారుల కుటుంబానికి చెందింది. ఇకపోతే నగ్మ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన 12 సంవత్సరాల వయసులో ఆమెకు శరీరంలోకి హార్మోన్స్ ఇవ్వడం జరిగింది. దీనితో నగ్మా శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకొని సినిమాలకు సరిపోయే విధంగా ఆమెను తీర్చిదిద్దారు. ఇక ఆ తరువాత బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసి అగ్రకథానాయికల నడుమ హీరోయిన్ గా నటించి అందరినీ ఒప్పించింది. నగ్మా తన సినీ ప్రస్థానాన్ని హిందీ సినిమా భాగి చిత్రంతో సల్మాన్ ఖాన్ సరసన తన మొదటి సినిమా చేసింది. ఇక ఆ సినిమా 1990లో అత్యధిక వసూలు చేసిన ఏడవ చిత్రంగా గుర్తింపు పొందింది.

ఇక అలా తన ప్రస్థానాన్ని అనేక భాషలలో నటించి తన జీవితం లో తిరుగులేని హీరోయిన్ గా ముందుకు సాగింది. అయితే మధ్యమధ్యలో కొంత మంది హీరోలతో తనకు విభేదాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు క్రికెట్ ఆటగాడు గంగూలీ తో కూడా సంబంధాలు ఉన్నట్లు అనేకం వినిపించాయి. ఆమె కేవలం సినిమాలో పరంగానే కాకుండా అటు వ్యాపారం, ఇటు రాజకీయ రంగం వైపు కూడా అడుగులు వేశారు. ఆవిడ భారత జాతీయ కాంగ్రెస్ కు మద్దతు అయినందున ఢిల్లీలో ఆమె పార్టీలో చేరింది. అయితే రాజకీయాల పరంగా ఎక్కువ స్థాయిని చేరుకోలేకపోయింది ఆవిడ.



























