తెలుగు బిగ్‌బాస్‌ లో హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్‌ వస్తుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపధ్యంలో తాజగా ఆ వార్తలపై స్పందించింది ఆర్‌ఎక్స్‌100 హీరోయిన్. అవార్తలన్నీ అవాస్తవాలే.. తానూ తెలుగు బిగ్‌బాస్‌-5లో పాల్గొనడం లేదంటూ స్పష్టం చేసింది పాయల్ రాజ్‌పూత్‌.

ఆమె ట్విటర్‌ వేదికగా సమాధానం చెప్పింది. తాను తెలుగు బిగ్‌బాస్‌-5లో పాల్గొనడం లేదంటూ స్పష్టం చేసింది. ‘నేను తెలుగు బిగ్‌బాస్‌-5లో పాల్గొనడం లేదు. ఆ వార్తలన్నీ అవాస్తవాలే.. దయచేసి ఇలాంటి వార్తల్లోకి తనను లాగవద్దు’ అంటూ ట్వీట్ చేసారు హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్‌.

తెలుగులో మొదటి సినెమా ‘ఆర్‌ఎక్స్‌100’ బోల్డ్‌ బ్యూటీగా తెలుగువారి గుండెల్లో ప్రత్యేకస్థానాన్ని సంపాదించిన పాయల్. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటించింది. ‘సీత’, ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’, ‘వెంకీ మామ, ‘డిస్కోరాజా’, ‘ఏంజిల్‌’ వంటి చిత్రాల్లో నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here