హీరోయిన్ “ప్రేమ” ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ లకు పోటీ ఇచ్చిన నటి “ప్రేమ”. వెంకటేష్ నటించిన “ధర్మ చక్రం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రేమ.. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడ భాషలలో పలు సినిమాల్లో నటించింది. అయితే ప్రేమ నటించిన “దేవి” సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమానే.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని చోటు సంపాదించుకుంది. ఆ తరువాత అవకాశాలు లేక తెరపై కనుమరుగైపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది ప్రేమ.

ఇక ఇటీవల సెలబ్రిటీల రెండో పెళ్లిపై వార్తలు జోరుమీడున్నాయి.. సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న తరువాత.. సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. తరువాత వాటిపై స్పందిస్తూ “అటువంటిదేమీ లేదంటూ” సురేఖావాణీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.. తాజాగా మరో సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పుకార్లు మొదలయ్యాయి.
2006లో బిజినెస్ మెన్ జీవన్ అప్పచ్చుని పెళ్లి చేసుకుని పదేళ్ల కాపురం చేసింది ప్రేమ. ఆ తరువాత ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో 2016లో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు. తాజగా తన రెండో పెళ్లిపై పుకార్లు రావడంపై స్పందించింది ప్రేమ. ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని, ప్రస్తుతం నేను ఒంరటిగా, సంతోషంగా ఉంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యంపై కూడా చాలా పుకార్లు వస్తున్నాయి. అయ్తితే వాటిలో ఎటువంటి నిజం లేదు. అవి పూర్తిగా అవాస్తవాలు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది సేనియర్ నటి ప్రేమ.



























