“ఇష్టం” చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రియ దక్షిణాది ప్రేక్షకులను తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. “ఇష్టం” చిత్రం ఫ్లాపైనా ఆ తర్వాత వెండితెరపై అగ్ర హీరోలతో రొమాన్స్ చేసి టాప్ హీరోయిన్ గా ప్రేక్షకులను మెప్పించింది.

ఆ తర్వాత ఆండ్రూ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకొని కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా తన భర్తతో బార్సిలోనాలో షికార్లు కొడుతూ ఆ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్‌లోనే ఉంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం RRR సినిమాలో కనిపించబోతున్న అందాల తార శ్రీయ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి స్పందించింది.

తారక్ పై ఆమె చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులను హుషారెత్తించాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న భారీ మూవీ “RRR” (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్ దేవగన్ సరసన తాను నటించనున్నానని ప్రకటిస్తూ ఆ సిన్మాకు సంబంధించిన సీక్రెట్ ఒకటి రివీల్ చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రియ.. RRR మూవీ విశేషాలు, తారక్ పై తన మనోభావాలను తెలియజేయడమే కాకుండా తనతో నటించిన అగ్ర హీరోలపై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేసి నెటిజన్ల అందర్నీ ఆకట్టుకుంది శ్రియ శరన్.

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ మంచి కోస్టార్ అని, ఆయనొక పుస్తకాల పురుగు అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ కోసం చెబుతూ.. నా అల్లుడు సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ చాలా సైలెంట్‌గా ఉండేవాడని, ఇప్పుడు మాత్రం చాలా మారిపోయాడని చెప్పింది. అంతేకాదు ఎన్టీఆర్‌ను చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పి ఆయన ఫ్యాన్స్‌కి మాంఛి కిక్కిచ్చింది శ్రియ. అలాగే ప్రభాస కళ్ళు చాలా బాగుంటాయని, ఆ కళ్ళను ఎంతసేపు చూసినా తనవితీరదని కామెంట్ చేసింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం చెబుతూ.. ఆయనో పవర్ హౌస్ అని.. ఆయన దగ్గర శ్రియ చాలా జీవితానుభవాలను నేర్చుకున్నట్టుగా తెలియజేసింది.

ఇంకా మన ‘మన్మధుడు’ నాగ్ కోసం చెబుతూ.. “సంతోషం” సినిమాలో నాగార్జున సరసన నటిస్తున్నప్పుడైతే ఒక ఫ్యామిలీ పర్సన్ ప్రక్కన నటిస్తున్న ఫీలింగ్ కలిగేదని చెప్పింది. ఇంకా తనతో నటించిన వెంకటేష్, మహేష్ బాబుల గురించి చెబుతూ కరోనా నేపధ్యంలో తన భర్తతో కలిసి బార్సిలోనాలో ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా వివరించింది. సో.. ఈ ఇంటర్వ్యూను బట్టి శ్రియ అగ్రహీరోల ఫ్యాన్స్ అందర్నీ ఖుషీ చేసిందనే చెప్పవచ్చు. మరి మళ్ళీ శ్రీయ అందాలను వెండితెరపై మరోసారి చూడాలంటే RRR మూవీ విడుదలయ్యేంతవరకూ వేచిచూడాల్సిందే.! ????????????



























