Heroine Amritha Rao : మహేష్ బాబు ‘అతిధి’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ముద్దుగుమ్మ అమృత రావు తన దగ్గర పనిచేసే మేనేజర్ వల్లే మోసపోయిందంట. ఇలాంటివి గతంలో చాలా మంది సెలబ్రిటీలకు జరిగినవే. తమ వారి చేతిలోనే మోసపోవడం ఇండస్ట్రీ వారికి అలవాటే అని మరోసారి నిరూపించింది అమృత. కేరర్ లో కష్టపడి గుర్తింపు తెచ్చుకోవడం ఒకెత్తయితే గుర్తింపు వచ్చాక వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం మరోఎత్తు. సక్సెస్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్న అమృత రావుకు మంచి ఆవకాశాలు వచ్చినా మేనేజర్ వల్లే పోయాయట. ఈ విషయాన్ని అమృత స్వయంగా పంచుకుని హాట్ టాపిక్ గా నిలిచింది.

సల్మాన్ తో జోడి కట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నా…
బాలీవుడ్ లో షాహిద్ కపూర్ అమృత జంటగా ‘వివాహ్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక అమృత వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నా బడా హీరోతో జాతకడితేనే హీరోయిన్ కెరీర్ పీక్స్ లో ఉంటుంది కదా. అలా అమృత కి సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘వాంటెడ్’ సినిమాలో మొదట హీరోయిన్ గా అవకాశం వచ్చినా మేనేజర్ ఆ విషయాన్ని అసలు అమృత కి చెప్పలేదట.

ఏదో షూటింగ్ నిమిత్తం హోటల్ లో ఉండగా వేరే సినిమా ప్రొడక్షన్ మేనేజర్ పలకరించి తాను బిజీ అవ్వకపోయుంటే సల్మాన్ వాంటెడ్ లో హీరోయిన్ అయ్యుండేదానివి అని చెప్పడంతో మేనేజర్ వైపు చూస్తే బిజీ షెడ్యూల్ అందుకే చెప్పలేదు అని చెప్పి కూల్ గా రివెంజ్ తీర్చుకున్నాడట. ఈ విషయాలను అమృత రీసెంట్ గా తన జీవితం గురించి రాసిన పుస్తకం ‘కపుల్ అఫ్ థింగ్స్’ లో ప్రస్థావించింది. మొత్తానికి అలా అమృత అవకాశాలు వచ్చినా మేనేజర్ వల్ల మంచి ఆఫర్స్ మిస్ చేసుకుని ఫేడ్ అవుట్ అయిపోయింది.































