Heroine Laya : ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా తొలి అవకాశంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లయ. తెలుగమ్మాయి అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్వయంవరం, ప్రేమించు అంటూ వరుస హిట్లందుకుంది. అలాగే నంది పురస్కారాలను కూడా అందుకుంది. తన నటనతో ఆందరినీ ఆకట్టుకున్న లయ కెరీర్ బాగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ తరువాత కుటుంబం బాధ్యలకు దగ్గరైన లయ సినిమాలకు దూరమైయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్న లయ ఒకవైపు సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లో ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ చేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన ఫ్యామిలీ గురించి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

నా పిల్లలు తెలుగులో మాట్లాడలేరు…
లయ హీరోయిన్ గా ఇంకా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే అమెరికా ఎన్ఆర్ఐ ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. భర్త అక్కడే డాక్టర్ గా పనిచేస్తుండగా లయ గారు సినిమాలను వదిలేసి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా అమ్మాయి 14 ఏళ్ళు, అబ్బాయికి 12 ఏళ్ళు. ఇద్దరూ తెలుగు భాషలో రాయగలరు, పద్యాలను పాడగలరు కానీ తెలుగు మామూలుగా మాట్లాడలేరు అంటూ చెప్పారు.

వాళ్లిద్దరు పసిపిల్లలుగా ఉన్నపుడు తెలుగు మాట్లాడేవాళ్ళమని తెలుగు రైమ్స్ నేర్పించేదాన్ని కానీ పిల్లలకు మూడేళ్ళ వరకు మాటలు రాలేదు అంటూ లయ చెప్పారు. డాక్టర్ ని సంప్రదిస్తే ఏదో ఒక భాష నేర్పించండి ఒకేసారి రెండు భాషలు అంటే పిల్లలు నేర్చుకోలేరు అని చెప్పడంతో అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరం కాబట్టి ఇక ఇంగ్లీష్ నేర్పాము. అయితే తెలుగును ఆశ్రద్ధ చేయకుండా రాయడం, మన పద్యాలు అన్ని నేర్పినా మాట్లాడకపోవడం వల్ల అలవాటు లేదు అంటూ తెలిపారు.



























