Heroine Laya : తెలుగుమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనే ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అనే టాక్ ఉన్నా ఈ తెలుగు అమ్మాయి మాత్రం హీరోయిన్ గా మంచి సక్సెస్ చూసి కెరీర్ లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ అమ్మాయి మరెవరో కాదు ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా తొలి అవకాశంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న లయ. స్వయంవరం, ప్రేమించు అంటూ వరుస హిట్లందుకుంది. అలాగే నంది పురస్కారాలను కూడా అందుకుంది. తన నటనతో ఆందరినీ ఆకట్టుకున్న లయ కెరీర్ బాగా ఉన్న సమయం లోనే పెళ్లి చేసుకుని అమెరికా లో సెటిల్ అయ్యారు. ఆ తరువాత కుటుంబం బాధ్యలకు దగ్గరైన లయ సినిమాలకు దూరమైయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్న లయ ఒకవైపు సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లో ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ చేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన ఫ్యామిలీ గురించి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

ఎన్ఆర్ఐ ను పెళ్లి చేసుకోడానికి కారణం…
హీరోయిన్ లయ తన వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూలో పంచుకుంటూ తనది పెద్దలు కుదుర్చిన వివాహం అని చెప్పారు. అలాగే తనకు మొదటి నుండి ఇండస్ట్రీలోని వ్యక్తిని చేసుకోవాలనే ఇంట్రస్ట్ లేదని చెప్పారు. ఎంతో మంది ఆర్టిస్టులు మంచి స్నేహితులుగా ఉన్నా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎలా ఉంటున్నాయో మొదటి నుండి చూస్తున్నాం కదా అందుకే పెళ్లి చేసుకుంటే బయటి వ్యక్తిని చేసుకోవాలనే క్లారిటీ ఉందని చెప్పారు.

మొదట్లో బాగానే ఉన్నా సెలబ్రిటీలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఆ తరువాత కొద్ది కాలానికే విడిపోయిన జంటలను చాలానే చూస్తున్నాం. అదీ కాక పాత తరం నుండి డబ్బు జాగ్రత చేసుకోకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారో కూడా మనకు కథలుకథలుగా తెలుసు. అలాంటి వాటి నుండి నేర్చుకోవాలి కదా అందుకే డబ్బు విషయంలోనూ మొదటి నుండి చాలా జాగ్రతగా ఉంటానంటూ చెప్పారు. ఇక ఎన్ఆర్ఐ సంబంధం గురించి మాట్లాడుతూ అమెరికా తానా సభలకు వెళ్ళినపుడు ఒక తెలిసిన ఆవిడ ద్వారా సంబంధం రావడం, నా తల్లిదండ్రులను సంప్రదించమని చెప్పగా ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం అలా మా పెళ్లి జరిగింది అంటూ లయ చెప్పారు.






























