Heroine Laya : ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా తొలి అవకాశంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి లయ. తెలుగమ్మాయి అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్వయంవరం, ప్రేమించు అంటూ వరుస హిట్లందుకుంది. అలాగే నంది పురస్కారాలను కూడా అందుకుంది. తన నటనతో ఆందరినీ ఆకట్టుకున్న లయ కెరీర్ బాగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ తరువాత కుటుంబం బాధ్యలకు దగ్గరైన లయ సినిమాలకు దూరమైయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్న లయ ఒకవైపు సోషల్ మీడియాతో అభిమానులకు టచ్ లో ఉంటూనే మరోవైపు సినిమాల్లోను చేయాలని అనుకుంటున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన ఫ్యామిలీ గురించి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

భర్త ఏం చేస్తారంటే…
లయ గారి వివాహం పెద్దలు కుదిర్చినదే. లయగారు అమెరికాకు తానా సభలకు హాజరైనపుడు అక్కడ తన బంధువుల ఇంట్లో ఉండగా అక్కడికి వచ్చిన ఒకావిడ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడిగి తన భర్త సంబంధం గురించి చెప్పగా ఇండియా వెళ్ళాక చెప్తాను అని వచ్చేసారట లయ. ఇక ఇండియా వచ్చాక తల్లిదండ్రులకు మళ్ళీ తన భర్త తరుపున వాళ్ళ నుండి ఫోన్ రావడం, సంబంధం గురించి అడగడంతో జాతకాలు అన్నీ సరిపోవడంతో పెళ్లి జరిగింది అంటూ చెప్పారు. లయ గారి భర్త శ్రీ గణేష్ అమెరికాలో రేడియేషన్ అంకాలజీ వైద్యులుగా పనిచేస్తున్నారు.

అక్కడే సొంతంగా ఒక హాస్పిటల్ అలాగే మరో రెండు హాస్పిటల్స్ లో పార్టనర్షిప్ కూడా ఉందట. ఇక అవి కాకుండా ఇతర ఆస్తులు ఉండగా వాటిని చూసుకుంటున్నారు. లయ మొదట్లో ఐటి ప్రొఫెషనల్ గా ఉద్యోగం కూడా చేసినా ప్రస్తుతం తన భర్త సహాయంతో ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే లయకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప శ్లోక 14 ఏళ్ల వయసు కాగా బాబు 12 ఏళ్ల వయసు. పాప శ్లోక అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కూడా నటించింది. అయితే తన పాప నటించాలనే కోరిక తనకు ఉందని కాకపోతే తన ఇష్టానికి గౌరవం ఇస్తానంటూ చెప్తున్నారు.



























