Heroine Nayanatara : తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లోనూ నటించి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా, అగ్ర తారగా కొన్నేళ్లుగా టాప్ పొజిషన్ లో ఉంటూ హీరోలకు పోటీగా అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ మరెవరో కాదు నాయనతార. తెలుగులో వెంకటేష్ సినిమా ‘లక్ష్మి’లో హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ తరువాత అగ్ర హీరోలందరి సరసన నటించింది నయనతార. ఇక తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తమిళనాడులో లేడీ సూపర్ స్టార్ గా ఉంటూ హీరోలతో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నయన్ ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలను సరోగసీ ద్వారా కనింది.

అందుకే సినిమా ప్రమోషన్స్ కి దూరం…
నయనతార అందరి హీరోయిన్స్ లాగా కాదు. ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక సినిమా ఈవెంట్ లో కానీ ప్రమోషన్స్ లో కానీ అసలు కనిపించదు. సినిమా షూటింగ్ అయ్యిందా ఇక నాకు ఆ సినిమాతో సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఇక నయన్ తాజాగా ‘కనెక్ట్’ అనే హారర్ సినిమాల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మొదటి సారి ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్ యాంకర్ సుమ ఇంటర్వ్యూలో ఎందుకు తాను ప్రమోషన్స్ రాను అనే విషయం గురించి సరదాగా మాట్లాడారు.

చక్కగా తెలుగులో మాట్లాడిన నయన్ తాను ఇటీవల గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ కు రాకపోడానికి కారణం తాను విదేశాల్లో ఉండటమే అంటూ చెప్పారు. తనకు ఎక్కువ బయటకు రానని, పొగడ్తలు అవి నచ్చవు అంటూ అందమైన యాంకర్ నా ముందు ఉంటే ఇంటర్వ్యూ ఇస్తానంటూ ఫన్నీగా సుమ తో మాట్లాడారు. ఇక తన భర్త చాలా మంచివాడంటూ సర్టిఫికెట్ ఇచ్చారు నయన్.






























