Heroine Payal Ghosh: సినిమా వాళ్లకు క్రికెట్ ఆటగాళ్లకు మధ్య మంచి రెలేషన్స్ ఉంటాయి. అదికూడా బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడపడం ఇప్పటిది కాదు. కపిల్ దేవ్ దగ్గరి నుండి నేటి ధోనీ వరకు అందరి మీదా బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టేవి. అయితే వీటికి ఎప్పటికప్పుడు బ్రేక్ ఇస్తూ వేరే వాళ్లను పెళ్ళిళ్ళు చేసుకుని కొంతమంది ఆటగాళ్ళు సెటిల్ అయితే విరాట్ లాంటి వాళ్ళు ప్రేమించిన హీరోయిన్ తోనే పెల్లి బంధం కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఒక బాలీవుడ్ మాజీ హీరోయిన్ క్రికెట్ ఆతగాడితో తన ప్రేమాయణం అలాగే మరో క్రికెటర్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా చెప్పి హాట్ టాపిక్ గా నిలిచింది.

గంభీర్ నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు…
పాయల్ ఘోష్.. ఈ నటి పెద్దగా తెలుగులో సినిమాలను చేయకపోయినా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో వచ్చిన మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగులో సుపరిచితురాలు. ఇక ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈ బెంగాలీ భామ కన్నడ, తమిళంలో కూడా ఒక్కొ సినేమా చేసింది. హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఈ అమ్మడు పెద్దగా రానించలేదు. ఇక క్రికెటర్ తో ప్రేమలో పడి బాగా వైరల్ అయిన పాయల్ ఇండియన్ జట్టు ప్లేయర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ తో ప్రేమాయణం నడిపింది. అప్పట్లో వీరి బంధం హాట్ టాపిక్ కాగా ఆ తరువాత విడిపోయారు. బ్రేక్ అప్ అయ్యాక అనారోగ్యంతో బాధపడినట్లుగా తెలిపిన పాయల్ సినిమాలు కూడా చేయలేకపోయానంటూ ఇటీవల వరుస ట్వీట్స్ తో పంచుకుంది. జీవితంలో ప్రేమించింది కేవలం ఇర్ఫాన్ ని మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది.

Gautam Gambhir mujhe regularly miscall dete the , yeh Irfan ko bohot achhi ta rah pata tha , woh mera sab calls check karta tha .. woh yeh baat mere Samna Yusuf bhai, Hardik Aur Krunal Pandya ko bhi bataya tha jab main irfan ko Pune mein Milne gayi thi.. Domestic match tha…
— Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023
After we broke up … I fell ill .. I couldn’t work for years… but he was the only guy whom I loved… after that I never loved anybody ???? pic.twitter.com/vKRYWJl0Ti
— Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you ????????
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023
ఇక ఇర్ఫాన్ తో ప్రేమలో ఉన్నపుడు గౌతమ్ గంభీర్ తనకు తరచూ మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడు, ఈ విషయం ఇర్ఫాన్ కి కూడా తెలుసంటూ ట్వీట్ చేసింది. నా ఫోన్ తరచూ ఇర్ఫాన్ చెక్ చేసేవాడని, ఒకసారి పుణె లో ఇర్ఫాన్ ను కలవడానికి వెళ్ళినపుడు క్రునాల్ పాండ్య, హర్ధిక్, యూసఫ్ ముందు ఈ విషయం గురించి చెప్పాడు అంటూ ట్వీట్ చేసింది పాయల్. ఇటీవల వరల్డ్ కప్ లో శ్రీలంకతో జరిగిన ఆటలో ఏడు వికెట్లు పడగొట్టి హాట్ టాపిక్ అయిన మహ్మద్ షమీ ను పెళ్లి చేసుకుంటా అంటూ ట్వీట్ చేసి వైరల్ అయిన పాయల్ ఇపుడు ఇర్ఫాన్ అలాగే గౌతమ్ గంభీర్ ల గురించి వరుస ట్వీట్ తో బాగా హాట్ టాపిక్ అవుతోంది.



























