Heroine Prema : దేవి సినిమాతో చెరగని ముద్ర వేసుకున్న నటి ప్రేమ. ధర్మచక్రం సినిమాలో వెంకటేష్ సరసన నటించి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగులో చేసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగమ్మాయి అనే ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ కస్తూరి. తండ్రి టూరిజం డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా ప్రేమ గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన క్రికెటర్ అయ్యప్ప. ఇక ఆమె సినిమాల్లోకి వచ్చాక తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ రామన్న చౌదరి అలాగే ఢీ, చిరునవ్వుతో వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుత తెలుగులో నటించడం లేదు. ఇక బెంగళూరులో నివాసముంటున్న ఆమె తన ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి వివరించారు.

సౌందర్యని అలా చూసి తట్టుకోలేకపోయాను…
ప్రేమ, సౌందర్య ఇద్దరూ కన్నడ నుండి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లే. ఇద్దరూ కలిసి తెలుగు కన్నడలో దాదాపుగా నాలుగు సినిమాలను కలిసి చేసారు. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదట. సౌందర్య బాగా సైలెంట్ గా ఉండేదని మొదట్లో పెద్దగా మాట్లాడేది కాదని తెలిపారు ప్రేమ. అయితే కన్నడ హీరో విష్ణు వర్ధన్ తో కలిసి ‘ఆప్తమిత్ర’ సినిమా చేసే సమయంలో ప్రేమ, సౌందర్య, విష్ణు వర్ధన్ గారు ఎక్కువగా మాట్లాడుకునేవారట. ఆ సమయంలోనే సౌందర్య తనకు మరింత క్లోజ్ ఫ్రెండ్ అయిందని ప్రేమ తెలిపారు. అలాంటి తాను మరణించినపుడు చివరిసారిగా చూడటానికి తన ఇంటికి వెళ్ళినపుడు ఇంట్లోకి వెళ్ళే సమయంలోనే తన ఫోటో అన్న ఫోటో చూడగానే బాధ అనిపించింది.

ఇక లోపల సౌందర్య శవం చూసాక తట్టుకోలేక పోయాను. తల లేదు బాడీ మాత్రమే ఉంది, అది కూడా వాచ్ మ్యాన్ చూసి గుర్తు పట్టి శవం సౌందర్యదని కన్ఫర్మ్ చేసారు. ఆ రోజు అనిపించింది, ఇంతే కదా జీవితం ఏం తీసుకుపోతాం పైకి పోయేటప్పుడు, మంచి పేరు మాత్రం ఇక్కడే మిగిలంటుంది మనకంటూ అనిపించింది అంటూ సౌందర్యతో అనుబంధం వివరించారు. ఇప్పటికీ సౌందర్య భర్త రఘు తో మాట్లాడుతుంటానని, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారని ఇద్దరు అమ్మయిలు ఉన్నారని తెలిపారు ప్రేమ.


































