Heroine Vaishnavi Chaitanya : హీరోయిన్ వైష్ణవి అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ బేబీ సినిమా హీరోయిన్ అంటే మాత్రం గుర్తు పడతారు. యూట్యూబర్ గా అందరికి సుపరిచితురాలైన వైష్ణవి, యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయి ఆ తరువాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అలా మంచి పేరు తెచ్చుకున్న వైష్ణవి ఒకవైపు వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ప్రేక్షకులకు దగ్గరయింది. కొన్ని సినిమాల్లో సహాయక పాత్రలను సైతం చేసిన వైష్ణవి బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో హీరోయిన్ గా తన కెరీర్ ను సుస్థిరం చేసుకుంది. తాజాగా జాక్ సినిమాతో మరో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న ఈ తెలంగాణ పిల్ల రీసెంట్ ఇంటర్వ్యూ లలో తన మొదటి సినిమా విజయం తనకు ఎలాంటి పాఠాలను నేర్పిందో చెప్పింది.

బేబీ సినిమా సక్సెస్ నేర్పిన పాఠం….
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉంటారు. అయితే ఒక సినిమా విజయం వాళ్లలో ఆత్మ విశ్వాసం పెంచిన వరుసగా అవకాశలు రావడంతో కొంతమంది ఏవి ఎంచుకోవాలో తెలియక తికమక పడి కెరీర్లో రాంగ్ స్టెప్ వేస్తారు. కాకపోతే కొంతమంది అచితూచి మంచి నిర్ణయాలు తీసుకుని నిదానంగా అయినా కెరీర్ లో బలమైన పునాది వేసుకుంటారు. అలానే వైష్ణవి కూడా బేబీ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చింది.
కానీ ఆ సినిమా సక్సెస్ సంతోషం కంటే ఎక్కువ ఒత్తిడిని తెచ్చిందని చెబుతుంది ఈ చిన్నది. ఆ సినిమా విజయం వల్ల నెక్స్ట్ ఎలాంటి కథ ఎంచుకోవాలి అన్న సంధిగ్ధ పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి పరిస్థితిలో మంచి స్క్రిప్ట్ రావడం అదృష్టం అంటూ తన సినిమా ఎంపిక గురించి వైష్ణవి తన అభిప్రాయాలు పంచుకుంది.



























