కూతుళ్ళ చేసిన పనుల వల్ల పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్న తండ్రులు వీళ్ళే !!

0
1403

సాధారణంగా ప్రతి ఇంట్లో ఎదో ఒక సమస్య ఉంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానలుగా మారి పోలీస్ స్టేషన్ వరకు వెళ్తూ ఉంటారు. మాములు ప్రజల విషయంలో ఇవి చాలానే చూస్తుంటాం. కానీ సెలెబ్రేటిస్ ఇళ్లల్లో మాత్రం చిన్న విషయం జరిగితే అవి టీ కప్ లో తుఫాన్ లా పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాం. సొంత కూతుళ్ళ పైననే కొందరు కన్న తండ్రులు కేసులు పెట్టారు. విచిత్రం ఏంటంటే అది కూడా ఆస్తుల కోసం కొన్ని అయితే ఇగో సమస్యలతో మరి కొన్ని. ఆలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తండ్రులు..

తండ్రుల వల్ల కేసుల పాలయిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

మొదటగా సౌత్ ఇండియాలోనే పాపులర్ సినిమా కుటుంబం అయినా మంజుల మరియు విజయ్ కుమార్ ల గురించి చెప్పుకోవాలి. వీరికి ముగ్గురు కూతుళ్లు. ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు కూడా. కానీ ముగ్గురు కూతుళ్లలో పెద్ద అమ్మాయి వనితతో మాత్రం ఈ కుటుంబానికి ఎప్పుడు గొడవలే. నా కొడుకుని నాకు కాకుండా చేసారు అంటూ వనిత తండ్రి పై కేసు పెడితే ఆమె వల్ల తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని తండ్రి కేసు పెట్టాడు. వనితను ఏకంగా మంజుల ఇంట్లో ఉండటానికి వెళ్ళేదు అంటూ పోలిసుల సహాయం తో బయటకు గెంటేసాడు. ఇందులో తప్పు ఎవరిదీ అనే సంగతి పక్కన పెడితే విజయ్ కుమార్ మాత్రం కూతురు వల్ల చాల సార్లు పబ్లిక్ గా గొడవలు పడడం కేసులు పెట్టడంతో మీడియాకి పని చెప్తూనే ఉంటారు.

ఇక ఇదే దోవలో వచ్చే మరో తండ్రి కన్నడ స్టార్ హీరో దునియా విజయ్. ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకోవడంతో అస్సలు గొడవ మొదలయ్యింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో ఒక నటితో రిలేషన్లో ఉన్నాడు దునియా విజయ్. ఇక అక్కడ మొదలైంది అసలు సమస్య.. అది ఏకంగా కూతురిపై విజయ్ కేసులు పెట్టె వరకు వెళ్ళింది. ఒక రోజు తండ్రి పై కోపంతో దునియా విజయ్ ఇంటికి వెళ్లి తాళం పగలగొట్టి మరి ఇంట్లోకి వెళ్ళింది అనే కారణంతో ఏకంగా కూతురు పైన కేసు పెట్టాడు విజయ్. ఇక తండ్రి తనను వేధిస్తున్నాడు అంటూ అయన కూతురు సైతం విజయ్ పై కేసు పెట్టింది.

ఇక తన కూతురు తనను చూసుకోవడం లేదు అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు హీరోయిన్ లిజి తండ్రి. నాకస్సలు తండ్రి లేడు..ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అంటుంది లిజి. ఈ గొడవ అటు ఇటు పోయి పోలీస్ స్టేషన్ లో పంచాయితీ వరకు వెళ్ళింది.

అలాగే ప్రేమ కథ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయం అయిన నటి ఆంత్ర మాలి. ముసలి వయసులో ఉన్న తండ్రిని పట్టించుకోకపోవడంతో వేరే దారి లేక కూతురి పైన కేసు పెట్టాడు ఆమె తండ్రి. ఆ తర్వాత కోర్ట్ బయట సెటిల్ చేసుకున్నారు. అయితే ఆ మధ్య ఈ వార్త మాత్రం బాగా వైరల్ అయ్యింది.

ఇక తండ్రులే కాదు తల్లులు కూడా కూతుళ్లపైనా కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయ్. హీరోయిన్ సంగీత గుర్తు ఉంది కదా. తనను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని చూస్తుంది అంటూ కన్నా కూతురి పైన కేసు పెట్టింది సంగీత తల్లి. ఆ కేసు ఇప్పటికి నడుస్తూనే ఉంది.

ఇక ఖుష్బూ తండ్రి సైతం పలుమార్లు తన తండ్రి పైన కోపాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసింది. ఇవండీ కూతుళ్ళ వల్ల పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన తండ్రుల విషయాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here