సినిమా ఇండస్ట్రీలో తాగడం అనేది ఓ ఫ్యాషన్. తాగకపోతే తప్పుగా అనుకుంటారేమో అన్నట్లు ఉంటుంది వ్యవహారం. ఈవెంట్ ఏదైనా, పార్టీ ఏదైనా మద్యం లేనిదే పని జరగదు. చెప్పాలంటే ఇండస్ట్రీలో దాదాపు 90 శాతం మంది మద్యం తాగుతారనేది టాక్. అయితే కొందరు చెప్పుకుంటారు. మరికొందరు దాస్తారు. గతంలో సావిత్రి, సిల్క్ స్మిత లాంటి వాళ్ళు మద్యానికి బానిస అయి జీవితాలను, ఆయుష్షును పోగొట్టుకున్నారు. నిన్నటి తరానికి వస్తే మనీషా కొయిరాలా వంటి వారు కూడా ఈ తాగుడు కి బానిసై కాన్సర్ లాంటి వ్యాధికి కూడా గురయ్యారు.

కానీ అప్పట్లో మీడియా కంట పడితే తప్ప తాగిన విషయం బయటకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఆలా కాదు బాహాటంగానే ఈ విషయాన్నీ బయటకు చెప్తున్నారు హీరోయిన్స్. ఆలా ఫుల్లుగా తాగే అలవాటు ఉంది మీడియా ముఖంగా చెప్తున్న హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

ఈ లిస్ట్ లో మొదటగా చెప్పుకోవాల్సింది మాత్రం హీరినే శృతి హస్సన్ గురించే. కమల్ హస్సన్ గారాల పట్టి శ్రుతి హాసన్ తనకున్న తాగుడు అలవాటు గురించి చెప్తూ మద్యం మానలేక కెరీర్ పరంగా కూడా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పింది. ఇలా బాహాటంగా శ్రుతిహాసన్ తన బలహీనతను బయటపెట్టడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అయితే ఇప్పుడు తాను మందుకు చాలా దూరంగా ఉన్నానని, ఇకపై మద్యం జోలికి వెళ్లనని కూడా చెప్పింది.

ఇక ఇదే దోవలో మరొక హీరోయిన్ వీణ… తమిళ నటి అయిన వీణ తాను ఫుల్లుగా మద్యం తాగుతాను అని బల్లగుద్ది మరీ చెప్తోంది. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీణ మాట్లాడుతూ తెగ ఊగిపోయారు. ‘నాకు తాగుడు అలవాటు ఉందన్న విషయాన్ని బయటపెట్టడానికి నేనెందుకు భయపడాలి? అదేమన్నా క్షమించరాని నేరమా? నేను బీర్ తాగితే నేను చాలా మాట్లాడేస్తాను. నేను ఈ విషయాన్ని గతంలో కూడా వెల్లడించాను. చాలా మంది యంగ్‌స్టర్స్‌కి కూడా అలవాటు ఉంటుంది కదా. ఈ అలవాటు వల్ల ఎవరికీ హాని ఉండదు. ఇది నా వ్యక్తిగతం. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్లు చేస్తుంది తప్పో కాదో ఓసారి సరిచూసుకోవాలి’ అంటూ హితబోధ కూడా చేస్తుంది.

ఇక ‘పటాస్’ షో తో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి తన యాంకరింగుతో పాటు ఇటీవల బిగ్ బాస్ లోను సందడి చేసి ఈ తరం యువతను ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొన్న ఆ మధ్య పటాస్ షో నుంచి బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించిన శ్రీముఖి… తాజాగా అభిమానులతో లైవ్ చాటింగ్ లో తన వ్యక్తి గత జీవితానికి సంభదించినా అనేక విషయాలను చెప్తూ మీరు మందు కొడతారా? అనే ప్రశ్నకు శ్రీముఖి మొమమాటం లేకుండా సమాధానం ఇచ్చారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే… అకేషనల్లీ మందు కొడతాను. ఎక్కువగా వైన్ ప్రిఫర్ చేస్తాను. అది ఆరోగ్యం కూడా..” అంటూ నిజం ఒప్పుకున్నారు శ్రీముఖి.

ఇక బాలీవుడ్ లో అయితే ఈ అలవాటు అందరికి ఉంటుంది. కానీ బయటకు చెప్పేవాళ్ళు ఉండరు. కానీ పరిణీతి చోప్రా మాత్రం అలా కాదు. తాను మొదటి సారి మందు తాగినప్పుడు జరిగిన సీన్ తో సహా అన్ని చెప్పేసింది, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు మద్యం అలవాటు లేదట.అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత కూడా ఓ అయిదారు సినిమాలు చేసేదాకా అసలు ఈ హీరోయిన్ మద్యం జోలికే వెళ్ళలేదట. ఇప్పుడైతే పరిణీతి మద్యాన్ని హ్యాంగ్ అవుట్స్ లో తాగుతోందట. ఇక తొలిసారి మద్యం తాగినప్పుడు, తొలిసారి మత్తులో మునిగినప్పుడు వెరైటి పనులు చేసానని, తన మీద తనకు కంట్రోల్ లేని తరుణంలో కూడా బాగా ఎంజాయ్ చేసానని, రాత్రంతా డ్యాన్స్ చేసి అందరికి ముద్దులు కూడా పెట్టానని పరినీతి తన మద్యం గ్నాపకాల్ని బయటపెట్టింది.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మహేష్ భట్ కుమార్తె, మాజీ హీరోయిన్ పూజాభట్ మాట్లాడుతూ తాను మద్యానికి బానిసనయ్యానని, మద్యంతాగే అలవాటున్న మహిళలు చాలామంది దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారని, తమకు అలవాటు లేదని బయటకు చెబుతారని అన్నారు. ఇవండీ మన హీరోయిన్స్ మందు కొట్టి బయటకు కక్కేస్తున్న నిజాలు…



























