జైలు జీవితం సాధారణ మనుషులకే జైలుకి వెళ్ళాలి అంటే భయం ఉంటుంది. అలాంటిది సెలెబ్రెటీ స్టేటస్ ని అనుభవిస్తూ అనుకోని సంఘటనల వాళ్ళ జైలు పాలైతే ? ఆ హీరోల, హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. మరి ఆలా దారుణమైన పరిస్థితులలో జైల్లో కాలం వెళ్లదీసిన హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
చాలా అంది హీరోస్, మేల్ యాక్టర్స్ కూడా జైల్లో గడిపిన వారున్నారు. కానీ ఇప్పుడు ఒక నటీమణుల గురించి మాత్రమే మనం చూద్దాం. అందులో ఎన్నో దారుణమైన కష్టాలు చవి చుసిన వారి గురించి మాత్రమే చెప్పావుతున్నాం. ఈ లిస్ట్ లో మొదటిగా తెలుసుకోవాల్సింది
1 స్నేహలతారెడ్డి

కన్నడ కి చెందిన ఈమె గురించి ఇప్పటి తరం వారికీ పెద్దగా తెలియదు. ప్రముఖ నర్తకిగా, నటిగా, దర్శకురాలిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అయితే స్నేహలత రెడ్డి పౌర హక్కుల ఉద్యమంలో ఒక కార్యకర్తగా భాగమై, ఎమర్జెన్సీని, ఇందిరా గాంధీని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రముఖ కవి పట్టాభిరామారెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆమె, తన భర్త ఇద్దరు సామజిక ఉద్యమకారులు. రాజకీయ, సామజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ఇద్దరు కలిసి కృషి చేసేవారు.

ఆ సమయంలోనే దేశంలో రాజకీయా వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈక్రమంలో 1976 మే 2 వ తేదీన స్నేహలత ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ సమయంలో ఆమెతో పటు ఉన్న ఆమె భర్తను, పిల్లలను అరెస్టు చేసారు పోలీసులు. ఇంక ఆ సమయంలో ఆమెకు ఎం చేయాలో తెలియక తన పిల్లలను, భర్తను విడుదల చేస్తే విచారణకు సహకరిస్తానని ఆమె ప్రాధేయపడ్డారు.

దేనితో పిల్లను, భర్తను పోలీసులు విడుదల చేసారు. బరోడా డైనమేట్ కేసులో జార్జ్ ఫెర్నాండేజ్ తో పాటు స్నేహలతను కూడా నిందితురాలిగా చెబుతూ అరెస్ట్ చేసారు. కానీ చార్జిషీట్ లో ఆమె పేరు లేదు. ఏ ఆధారాలు లేవు అయినా జైలు నిర్బంధములోనే అనెను కొనసాగించారు. హింసకు, వేధింపులకు గురయ్యారు. ఆమెను జైలులో పెట్టి హింసించిన, వేధింపులకు గురిచేసినా ఆమె తోటి ఖైదీల కోసం జైలులో కూడా నిరాహార దీక్ష చేసారు. స్త్రీ ఖైదీలకు ఏంటో దర్యాన్నిచ్చారు. ఈ విషయాలు అన్ని ఆమె జైలులో ఉన్న సమయంలో డైరీలో రాసుకున్న విషయాలు. హింసకు, వేధింపులకు గురికావడంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆసుపత్రిలో చూపించకుండా వేధించడంతో పోలీసులు కూడా సహకరించలేదు. అయితే స్నేహలత ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించడంతో 1976 డిసెంబర్ 13 వ తేదీన ఆమెను పెరోల్ మీద విడుదల చేసారు. కానీ కొద్దిరోజులకే అంటే 1977 జనవరి 20న ఆమె తుది శ్వాస విడిచారు. జైలుకి వెళ్లిన సమయంలో ఎంత యవ్వనం గా ఉన్న ఆమె జైలు నుంచి విడుదలైన సమయంలో వృద్ధురాలుగా అనారోగ్యంతో వచ్చారు.
ఇక ఇదే తరహా కష్టాలను అనుభవించిన మరో నటి
మోనికాబేడీ

అండర్ వరల్డ్ డాన్ ను ప్రేమించిన పాపానికి అతని చేతిలో వేధింపులకు గురయ్యి, దెబ్బలు తింటూ ఎన్నో ఏళ్ళు జీవించింది. కానీ ఒకానొక సమయంలో అక్కడ నుంచి తప్పించుకుని పోలీసులకు చిక్కి అరెస్టు అయింది. అలా రెండేళ్ల పాటు మోనికా జైలులో గడిపింది. ఒకప్పుడు విపరీతమైన స్టార్ డమ్ చుసిన మోనికా జైలులో బాత్రూంల పక్కనే పడుకున్న అంటూ ఆమె ఆత్మ కధలో రాసుకుంది. జైలు నుండి విడుదలయ్యి అతి సాధారణ జీవితం గడుపుతుంది ప్రస్తుతం.
శ్వేతా బసు ప్రసాద్

ఇక బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శ్వేతా బసు సైతం ఒక రెండు నెలల పటు జైలు జీవితం గడిపింది. పాస్టిట్యూషన్ కేసులో అరెస్టు అయ్యి, ప్రభుత్వ హోం కి తరలించబడి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది శ్వేత. ఇప్పటికీ ఆరోజులను తలుచుకుని ఉలిక్కి పడిలేస్తాను అంటూ ఒక ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
మధుబాల

లెజెండ్రీ నటి మధుబాల కూడా ఒక సందర్భంలో జైలుకు వెళ్లారు. నిర్మాత నుంచి డబ్బులు తీసుకుని ఆ తరువాత సినిమా చేయకపోవడంతో కొన్ని రోజులు ఆమె జైలులో ఉండాల్సి వచ్చింది.
సోనాలి బింద్రే

తన అందం, నటనతో సోనాలి బింద్రే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా చెరగని ముద్ర వేసింది. కానీ ఓ మతాన్ని కించపరిచేలా ఫోటోషూట్ చేయడంతో సోనాలి జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చింది.



























