సినిమా క్రికెట్ ఈ రెండు విడదీయలేని బంధాన్ని కలిగి ఉంటాయి.. ఈ రెండు విభిన్న రంగాలకు ఫాన్స్ ఉంటారు అలాగే స్టార్ డమ్ ఉంటుంది. అలాగే ఈ వృత్తులలో ఉండేవాళ్లు మధ్య కూడా ప్రేమ చిగురిస్తూ ఉంటుంది. హీరోయిన్స్, క్రికెటర్స్ మధ్య ప్రేమ చిగురించడం ఇప్పుడు కొత్తేమి కాదు. ఈ ప్రేమ పెళ్లి వ్యవహారాలు 80వ దశకం నుండి ఉన్నాయ్..

షర్మిల ఠాగూర్ పటౌడీ జంట నుండి ఇప్పుడు మనం చూస్తున్న కోహ్లీ, అనుష్క తరం వరకు హీరోయిన్స్ తో క్రికెటర్స్ కి సంబంధాలు ఉంటున్నాయి. కొన్ని అన్ని అవరోధాలు దాటుకొని పెళ్లి పీటలు ఎక్కితే కొన్ని మధ్యలోనే చిదిమిపోతున్నాయి. అలా ప్రేమ పేరుతో హీరోయిన్స్ క్రికెటర్స్ చేతిలో మోసపోయిన సంఘటనలు ఉన్నాయ్. అలాంటి మోసపోయిన ప్రేమ కథలు, అలాగే ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.

మొదటగా ఈ లిస్ట్ లో చెప్పుకోవాల్సింది సోయగాల హీరోయిన్ నగ్మా గురించే.. నగ్మా ఒకానొక టైం లో సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తూ పలు భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగుతున్న రోజుల్లో మరో పక్క సౌరవ్ గంగూలీ ఇండియాని ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొత్త అడుగులు వేయిస్తున్న సమయం. ఇలాంటి పీక్ కెరీర్స్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో పడ్డారని అటు క్రికెట్ ప్రపంచం ఇటు సినిమా ప్రపంచం షాక్ కి గురయింది. అప్పటికే పెళ్ళైన సౌరవ్ గంగూలీ కి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తి ని ప్రేమించిన నగ్మా అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. అప్పటికే పలు అఫైర్స్ తో ఆమె విసిగిపోయి కూడా ఉంది. కానీ సౌరవ్ గంగూలీ ప్రేమించాడు కానీ పెళ్ళికి ఒప్పుకోలేదు భార్యకు విడాకులు ఇవ్వడం కుదరదు అని చెప్పేయడం తో మోసపోయా అని అర్ధం చేసుకొని ఆ రిలేషన్ నుండి బయటకు వచ్చింది కానీ ఇప్పటి పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయింది.

ఇక నగ్మా తరహాలోనే మోసపోయిన మరొక నటి కిమ్ శర్మ.. ఈ భామ మన తెలుగులో ఖడ్గం సినిమాలో నడిచి మగధీర సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా నర్తించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి పాపులర్ అయిన ఈ భామ యువరాజ్ సింగ్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని మీడియాకి అనేక సార్లు పోజులు ఇచ్చారు . కిమ్ ని పెళ్లి చేసుకోవాలని యువరాజ్ సింగ్ భావించిన అతని తల్లి ఇందుకు ఒప్పుకోలేదు. కారణాలేంటో తెలియదు కానీ యువరాజ్ తల్లి కిమ్ శర్మల మధ్య ఈ విషయంలో చాలా సార్లు బాహాటంగానే గొడవలు జరిగాయి. ఈ క్రమం లోనే యువరాజ్ సింగ్ కిమ్ శర్మ కి బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత మల్లి క్రికెట్, అఫైర్స్ తో బిజీ అయ్యాడు. ఆ తర్వాత కాన్సర్ సోకి దాని నుండి కూడా బయట పడ్డాడు. ఇప్పుడు మరొక హీరోయిన్ హాజెల్ కీచ్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు.

ఆ తర్వాత మోసపోయా అంటూ మీడియా సాక్షిగా బయటపెట్టిన మరొక నటి నీనా గుప్తా. అస్సలు డేటింగ్ అనే పదం కూడా తెలియని రోజుల్లోనే నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ మధ్య ప్రేమ చిగురించింది. రిచర్డ్స్ కి అప్పటికే పెళ్లయ్యింది అయినా కూడా వీరిద్దరూ చాలా కాలం సహజీవనం చేశారు. ఈ క్రమం లోనే ఆమె ఒక కూతురికి కూడా జన్మ ఇచ్చింది. కానీ రిచర్డ్స్ తన మొదటి భార్యకు విడాకులు ఇస్తా అని నమ్మించి నీనా ను మోసం చేసాడు. చివరికి పెళ్లి కి అంగీకరించకపోవడం తో అతడితో బ్రేక్ అప్ చెప్పి వివేక్ మెహ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది నీనా. కానీ ఇది జరిగిన పాతిక సంవత్సరాలకు తనను వివ్ రిచర్డ్స్ మోసం చేశాడంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

ఇక చివరగా షేన్ వార్న్ మరియు ఎలిజాబెర్త్ హుర్లే.. హుర్లే యాక్ట్రెస్ గా ఉన్న తరుణంలోనే షేన్ వార్న్ ఆమె వెనక పడి మరి ప్రేమించాడు. అలాగే ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ షేన్ వార్న్ అమ్మాయిల పిచ్చి వల్ల ఎలిజబెత్ మోసపోయా అని అర్ధం చేసుకొని అతడి నుండి విడిపోయింది.
ఇవండీ క్రికెటర్స్ తో ప్రేమలో పడి మోసపోయిన హీరోయిన్స్ ప్రేమకథలు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. బాలీవుడ్ హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న క్రికెటర్స్ ఇండస్ట్రీ లో పాతిక జంటలకు పైగానే ఉన్న వారు హ్యాపీ గానే జీవిస్తున్నారు.



























