ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాలు రానపుడో.. లేక తమ మనసుకు నచ్చినప్పుడో వాళ్ళు వాడే చివరి అస్త్రం పెళ్లి. అప్పటి వరకు అవకాశాల కోసం మ్యాగ్జిమమ్ ట్రై చేసి చివరికి ఏడడుగులు నడుస్తారు మన హీరోయిన్లు. అలా దర్శకులను పెళ్ళి చేసుకున్న జంటల్లో ప్రముఖమైన జంటలేవో ఇప్పుడు చదవి తెలుసుకోండి.

???? రమ్యకృష్ణ – కృష్ణ వంశీ

రమ్యకృష్ణగారు కృష్ణ వంశీ డైరెక్షన్ “చంద్రలేఖ” చిత్రంలో నటించారు. ఆ చిత్రం షూటింగ్ సెట్స్ లో వీళ్ళిద్దరూ కలుసుకుంటూ దగ్గర అయ్యారు. కృష్ణ వంశీని ఇష్టపడుతున్న విషయం రమ్యకృష్ణ అదే సినిమా షూటింగ్ చివర్లో కృష్ణ వంశీకి చెప్పడంతో వీరి పెళ్లి 12 June 2003 లొ జరిగింది.
???? రోజా – RK సెల్వమణి

తెలుగులొ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న రోజా గారు తమిళ్ డైరెక్టర్ RK సెల్వమణి గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు, 10 August 2002 రోజున వీరి పెళ్లి జరిగింది.
???? సుహాసిని – మణిరత్నం

ప్రేమ కథ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే పాన్ ఇండియా డైరెక్టర్ మణిరత్నం గారు సుహాసిని గారు ఇద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేయలేదు. కానీ సుహాసినిని చూడగానే ప్రేమలో పడిపోయారు మణిరత్నం. డైరెక్టర్ గారి ప్రేమని కాదనలేకపోయిన సుహాసిని గారు మణిరత్నం గారితో 26 August 1988 న ఏడు అడుగులు నడిచారు.
???? సోనియా అగర్వాల్ – సెల్వ రాఘవన్

7 / G బృందావన్ కాలనీ సినిమా లొ హీరోయిన్ గా నటించిన సోనియా ఆ సినిమా డైరెక్టర్ సెల్వ రాఘవన్ గారితో ప్రేమ పడింది, ఒక సంవత్సర కాలం పాటు సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించుకున్న వీరిద్దరూ 15 December 2006 న పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య మనస్ఫర్ధలు ఎక్కువకావడంతో ఈమధ్యనే విడిపోయారు.
???? అమల పాల్ – AL విజయ్

బ్లాక్ బ్యూటీ అమల పాల్, తమిళ్ డైరెక్టర్ AL విజయ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, 12 June 2014 న వీరి పెళ్లి జరిగింది. కానీ వీరి దాంపత్య జీవితం కూడా ఎంతోకాలం నిలబడలేదు. వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలై ఈమధ్యనే విడిపోయారు. చదివారుగా.. సినీరంగంలోని కొన్ని ప్రేమకధలు ఎలా సుఖాంతమౌతాయో.. మరికొన్ని ఎలా విషాదంగా ముగుస్తాయో.. మరి ఈ ప్రేమ పెళ్ళిళ్ళపై మీ అభిప్రాయం ఏమిటో జర మాకూ చెప్పరాదూ..!



























