తెలుగు హీరోయిన్ల జీవితంలో కొన్ని చేదు విషయాలు…అన్నదమ్ములను కోల్పోయి…[స్పెషల్ స్టోరీ]

0
533

సినిమా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తుంటారు. కొంతమందికి మాత్రం లక్కు కలిసొచ్చి స్టార్ డం సొంతం చేసుకుంటారు. ఇంకొంత మంది మాత్రం కొన్ని సినిమాలతోనే సరిపెట్టుకుంది. అయితే హీరోయిన్స్ పైకి ఎంతో నవ్వుతూ అందంగా కనిపించిన వారి నిజ జీవితంలో మాత్రం ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ తమ ఫాన్స్ ఆనందం పెట్టాలనే మంచి పాత్రను ఎంచుకుని సినిమాలను చేస్తుంటారు. అలాంటి కొంత మంది హీరోయిన్ల జీవితంలో మాత్రం కొన్ని చేదు విషయాలు ఉన్నాయి.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ల నిజజీవితంలో కూడా ఒక తీరని లోటు ఉండిపోయింది. అదేంటంటే టాలీవుడ్ లో ఉన్న కొంతమంది తెలుగు హీరోయిన్స్ తమ తోడబుట్టిన సోదరులను కోల్పోయారు. తమతో పాటు ఆడి పాడి కలిసి పెరిగిన తమ సోదరులు… ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని నిజాన్ని బాధని గుండెలోన దాచుకుని పైకి మాత్రం ఎంతో సాధారణంగా కనిపిస్తారు. అలా తమతో పాటు పెరిగిన సోదరులను కోల్పోయిన ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరు…? వాళ్ల సోదరులను ఎలా కోల్పోవాల్సి వచ్చింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగమ్మాయి బిందు మాధవి…. బిందు మాధవి చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన అమ్మాయి. సాగర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో బిందుమాధవి ఆవకాయ బిర్యాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హీరోయిన్ గా బిందుమాధవి అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సమయంలోనే ఏమైందో తెలియదు గానీ ఆమె తమ్ముడు సాగర్ బలవన్మరణం పొందాడు. బిందు మాధవి కెరియర్ ఫాంలో ఉన్నప్పుడు తనకెంతో ఇష్టమైన తమ్ముని కోల్పోవాల్సి వచ్చింది.

ఇదేవిధంగా అతిలోకసుందరి శ్రీదేవి కుటుంబంలో కూడా జరిగింది. శ్రీదేవికి సతీష్ అనే సోదరుడు ఉన్నాడు. ఈయన శ్రీదేవి తండ్రి మొదటి భార్య కుమారుడు. శ్రీదేవితో పాటు కలిసి తిరిగిన సతీష్ ఓరోజు షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మరణించాడు. శ్రీదేవి తన సోదరుడిని కోల్పోవాల్సి వచ్చింది.

ఇకపోతే సౌందర్య…. సౌందర్యకి అమర్నాథ్ అనే అన్నయ్య ఉన్నాడు. షూటింగ్ కి సంబంధించిన విషయాలన్నీ తన తండ్రి చూసుకునేవాడు. అయితే తండ్రి మరణంతో సౌందర్యకి సంబంధించిన విషయాలు అన్ని అన్నయ్య అమర్నాథ్ చూసుకునేవాడు. ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అలా సౌందర్య అమర్ నాథ్ లు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లో వెళ్తుండగా….. మధ్యలో ఫ్లైట్ క్రాష్ అయ్యింది. సౌందర్య తో పాటు ఆమె అన్నయ్య కె ఎస్ అమర్నాథ్ కూడా ప్రాణాలు విడిచారు. సౌందర్య అన్నయ్య మరణించాడు.

ఇక హీరోయిన్ కేథరిన్ తెరెసా కూడా తమ తమ్ముణ్ణి కోల్పోయింది. ఇద్దరమ్మాయిలు సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కేథరిన్….. పలు తెలుగు చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమాలో నలుగురు హీరోయిన్ల లో ఒక హీరోయిన్ గా నటించింది. కేథరిన్ కు క్రిస్టఫర్ అలెగ్జాండర్ అనే తమ్ముడు కూడా ఉండేవాడు. ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా చనిపోయాడు. క్రిస్టోఫర్ అలెగ్జాండర్ బిపిఏ రెండో సంవత్సరం చదువుతుండగా బలవన్మరణం పొందాడు.. కేథరిన్ కి తమ్ముడు అంటే చాలా ఇష్టమని తమ జీవితంలో అత్యంత సాడ్ మూమెంట్ ఉంది అంటే అది తన తమ్ముడు చనిపోయిన సంఘటనే అని కేథరిన్ చెబుతూ ఉంటారు.

ఇకపోతే కమెడియన్ గీత సింగ్…. కితకితలు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతాసింగ్ పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసింది. ఈమె కూడా తమ అన్నయ్య వివేక్ సింగ్ కోల్పోయింది. అన్నా, వదిన ఇద్దరు మరణించడంతో అన్న పిల్లల్ని పెంచుతూ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. అలా ఎప్పుడూ అండగా ఉంటాడు అనుకున్న అన్నయ్య తనని వదిలేసి వెళ్లిపోయాడు అంటూ పలుమార్లు మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది.

ఇకపోతే శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్… రాజేష్ మంచి నటుడు పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతో పాటు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలోనే యాక్సిడెంట్లో రాజేష్ మరణించాడు. శ్రీలక్ష్మి కూడా తన సోదరుడు రాజేష్ ని శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది. అయితే రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. పలు సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారింది.

ఇలా తమకు తోడుగా అండగా ఉంటారు అనుకున్న తమ సోదరులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం వారికి తీరని లోటని మన హీరోయిన్లు చెబుతుంటారు. వీరే అండి తోడబుట్టిన సోదరులను కోల్పోయిన హీరోయిన్స్…… మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here