కెన్నెడీ జాన్ విక్టర్ ఈ పేరు చెబితే ఎవరు కనుక్కోలేరు. అదే హీరో విక్రమ్ లేదా చియాన్ విక్రమ్ అంటే ఇట్లే గుర్తుపడతారు. అవును విక్రమ్ అసలు పేరు కెనడీ జాన్ విక్టర్. వారి తల్లిదండ్రులు ఆ పేరు పెట్టగా విక్రమ్ నాపేరు నచ్చక తన పేరును తానే మార్చుకున్నాడు. విక్రమ్ ఏప్రిల్ 17 1966 న జన్మించాడు. తను తమిళంలో 1990 సంవత్సరంలో ఎం కాజల్ కన్మణి అనే సినిమా ద్వారా సినీ హీరోగా పరిచయం అయ్యాడు. ఇక అప్పటినుండి తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇకపోతే విక్రమ్ చదువు విషయానికొస్తే… ఆయన చెన్నై లోని లయోలా డిగ్రీ కళాశాలలో బిఏ ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందాడు. ఆ తర్వాత ఆ కాలేజీ లోనే ఎంబీఏ కూడా పూర్తి చేశాడు. అయితే తన తండ్రి నటుడు కావడంతో విక్రమ్ కు నాటకాలపై అమిత ఆసక్తి. అందుకే అతను తన కాలేజీ రోజుల నుండి అనేక నాటకాలలో నటించే వారు. అయితే అదే సమయంలో ఆయనకు శైలజా పరిచయమైంది. శైలజ విక్రమ్ నటించిన నాటకాలకు అభిమానిగా మారిపోవడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారి పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.

అయితే విక్రమ్ డిగ్రీ చదువుతున్న సమయంలో తన బైక్ పై స్నేహితులతో కలిసి రోడ్డుపై వెళ్తున్న సమయంలో వారి బైకును ఓ ట్రక్కు వచ్చి గుద్దింది. ఆ పరిస్థితుల్లో విక్రమ్ కుడికాలు బాగా దెబ్బతింది. దాంతో వారి తల్లిదండ్రులు అనేక వైద్యులను సంప్రదించగా చివరికి కాలును తీసేయాల్సి వస్తుందని తెలియజేశారు. దీనికి విక్రమ్ తల్లి ససేమీరా అని అడ్డు చెప్పి ఏకంగా నాలుగు సంవత్సరాల్లో 23 ఆపరేషన్స్ చేయించి తర్వాత విక్రమ్ మళ్లీ నడవ గలడు. నిజానికి విక్రమ్ మళ్లీ లేచి సినిమాల్లో నటించడం కోసం వారి తల్లిదండ్రులు వారి పూర్తి ఆస్తిని విక్రమ్ వైద్యానికి ఖర్చు పెట్టారు. అయితే విక్రమ్ నాలుగు సంవత్సరాలు తీవ్ర మనస్థాపానికి గురై తర్వాత ఎట్టకేలకు నడవసాగాడు. దీంతో అతని అడుగులు సినిమా వైపు వేశాయి.

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైనా పోషించగల కథానాయకుడిగా విక్రమ్ అంచెలంచెలుగా ఎదిగాడు. నిజానికి ప్రేమించిన శైలజ తో యాక్సిడెంట్ సమయంలో మరింత చనువు పెరిగింది. విక్రమ్ ఓ టీ షాప్ లో ఉన్నప్పుడు శైలజ ఫోన్ చేసినప్పుడు ఆమెకు ప్రపోజ్ చేశాడు. దీనికి ఆవిడ కూడా ఓకే చెప్పింది. ఆ తర్వాత ఆమెను ఓ చీరల షాప్ కి తీసుకువెళ్లి ఒక చీర కొనిచ్చి ఆ తరువాత ఆమె తల్లిదండ్రులు దగ్గరికి వెళ్లి విషయాన్ని తెలిపారు. దీంతో ఆవిడ తల్లిదండ్రులు కూతురి కోరికను మన్నించి వారి పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే 1990 సంవత్సరంలో తన కెరియర్ స్టార్ట్ అయిన చిన్న చిన్న సినిమాలో హీరోగా నటించిన అతను 1994 సంవత్సరంలో వారి వివాహం చేసుకున్నారు. వారి మతాలు వేరు కావడంతో రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటగా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన ఇద్దరు, మరోసారి గురువాయర్ ఆలయంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇప్పుడు ఒక కొడుకు ధ్రువ, కూతురు అక్షిత పుట్టారు. ఇక విక్రమ్ కుమారుడు ధ్రువ కూడా తన తండ్రి నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ఇక విక్రమ్ భార్య ఓ ప్రముఖ సైకాలజిస్ట్. అలాగే ఆవిడ ఓ వైద్య కళాశాలలో సైకాలజిస్ట్ లెక్చరర్ గా పని చేస్తున్నారు.



























