హాలీవుడ్ లో ఎప్పట్నుంచో ఫేమస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షోని ఇండియాకి కూడా తీసుకొచ్చారు. ఈ బిగ్ బాస్ షోని మొదట హిందీలో ప్రారంభించారు. హిందీలో 13 సీజన్లుగా ఈ షో నడుస్తుంది. అక్కడ మంచి విజయం సాధించడం తో తమిళ్, తెలుగులో కూడా బిగ్ బాస్ మొదలైంది. తెలుగులో ఇప్పటికే 3 సీజన్లు కంప్లీట్ చేసుకొని ఇటీవలే నాలుగో సీజన్ మొదలు పెట్టింది. ఈ సీజన్ కి మూడో సీజన్ ని హోస్ట్ చేసిన నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. ఈ షోపై ఎంత వ్యతిరేకత ఉందో, దీనిని ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా అంతే ఉన్నారు.

బిగ్ బాస్ అంటే కొంతమంది సెలెబ్రిటీలని తీసుకొచ్చి వాళ్ళకి టాస్కులు ఇచ్చి ఒక్కో వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ, ఫైనల్ గా ఒక విజేతని ప్రకటిస్తారు. దీనికి ఆడియన్స్ నుంచి కూడా ఓటింగ్ తీసుకుంటారు. సెలబ్రిటీ అంటే జనాలందరికి తెలిసిన వాళ్ళు అని అర్ధం. కానీ సెలెబ్రిటీలు అనే పదానికి బిగ్ బాస్ లో అర్ధం వేరేమో. 16 మంది కంటెస్టెంట్స్ ఉంటే అందులో సగం మందికి పైగా ఎవరికీ తెలియని వాళ్ళని, లేదా కొంతమందికే తెలిసిన వాళ్ళని తీసుకొస్తారు.అసలు జనాలు ఓటింగ్ వేయాలంటే ఆ సెలబ్రిటీస్ జనాలకి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి అనే చిన్న లాజిక్ ని మర్చిపోయిందేమో బిగ్ బాస్. జనాలకి తెలియని వాళ్ళని ఏదో ఒక సారి, ఎక్కడో ఒక ప్రోగ్రాంలోనో, సినిమాలోనో చేసిన వాళ్ళని, సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే సెలెబ్రిటీలు అని చెప్తుంది బిగ్ బాస్. అంతకు ముందు ఎవరికీ తెలియని వాళ్ళు కూడా ఈ షోతో ఫేమ్ తెచ్చేసుకుంటున్నారు. తెలుగులో అయితే గత సీజన్ల నుండి ఇదే జరుగుతుంది.

కొంతమంది అయితే మరీ అనామకుల్ని తెచ్చి అనవసరంగా సెలెబ్రెటీలను చేస్తున్నారు అని బిగ్ బాస్ ను తిట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే జనాలకి తెలియని వాళ్ళు తొందరగా షో నుంచి వెళ్లిపోతుంటారు.ఈ సారి షోలో మోనాల్ గజ్జర్, సూర్యకిరణ్, యాంకర్ లాస్య, అబిజిత్, జోర్దార్ సుజాత, మెహబూబ్, దేవి, దేత్తడి హారిక, ఇస్మార్ట్ సోహెల్, అరియానా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, నోయల్, దివి, అఖిల్ సర్తక్, గంగవ్వ లు కంటెస్టెంట్ లు గా పాల్గొంటున్నారు. ఇందులో యాంకర్ లాస్య, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, గంగవ్వ, దేత్తడి హారిక, నోయల్ మాత్రమే చాలా మందికి తెలుసు. మోనాల్ గజ్జర్, మెహబూబ్, దేవి, అభిజిత్ లు కొంతమందికి అన్నా తెలుసు.సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే వీళ్ళు తెలుసు. ఇక జోర్దార్ సుజాత, అఖిల్ సర్తక్, దివి, సూర్య కిరణ్, సోహైల్, అరియనా గ్లోరీలు ఎవరో కూడా చాలా మందికి తెలీదు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకి కూడా సగం మందికి వీళ్ళు తెలియదు. వీళ్లంతా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సినిమాలోనో, సీరియల్ లోనో, ప్రోగ్రాంలోనో క్యారెక్టర్స్ వేసిన వాళ్ళు.

ఇలా ఎవ్వరికి తెలియని వాళ్ళని తీసుకొచ్చి వాళ్లకి ఫేమ్ ఇస్తుంది బిగ్ బాస్. ఈ నేపథ్యంలో ఈ షోపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. గత సీజన్లను పరిశీలిస్తే కూడా ఎవ్వరికి తెలియని వాళ్ళు ముందే ఎలిమినేటి అయిపోతున్నారు. తెలిసిన వాళ్ళు మాత్రమే చివరి వరకు ఉంటున్నారు. అప్పుడు షోలో పోటీ ఉండట్లేదు. అలాంటప్పుడు తెలియని వాళ్ళని తీసుకు రావడం ఎందుకు అని వీక్షకులు అనుకుంటున్నారు. కానీ బడ్జెట్లు ఆలోచించి బిగ్ బాస్ ఇలా చేస్తుందని సమాచారం. అయితే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పటి వరకు మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈ గ్రాండ్ రియాలిటీ షో ఎట్టకేలకు 4వ సీజన్లోకి అడుగు పెట్టింది. ఈసారి సీజన్‌లో నాగార్జున ఎంట్రీ ఎపిసోడ్ మినహా మిగతా ఎపిసోడ్స్ కు అంత రెస్సాన్స్ రాలేదు. దీనికి కారణం బాగా తెలిసిన కంటెస్టెంట్స్ ఎక్కువ మంది లేకపోవడం అంటున్నారు షో ఫాన్స్. తాజాగా ఈ సీజన్లలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే కంటెస్టెంట్ యాంకర్ లాస్య అని తెలిసింది. ఈమెకు మాత్రమే అత్యధిక రెమ్యునరేషన్ ముట్టినట్టు తెలుస్తుంది. లాస్యకు తప్పితే మిగతా వారికంతా కూడా అతి తక్కువ అమౌంట్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేశారట. మరి రాబోయే రోజుల్లో ఈ షో ఎలా ఉండనుందో చూడాలి. ఈ సందర్భంగా బుల్లితెర యాంకర్ లాస్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

‘సమ్ థింగ్ స్పెషల్’ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన చలాకీ యాంకర్ లాస్య యాంకర్‌గా కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే లాస్య పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైంది. తన చిన్ననాటి స్నేహితుడు మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లాడిన లాస్య ఆపై యాంకరింగ్ చేయలేదు. ఇటీవలే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఇందులో పలు వీడియోలు పోస్టు చేస్తూ.. యూజర్లను ఆకట్టుకుంటోంది. తెలుగు యాంకర్‌లలో లాస్యది ప్రత్యేకమైన స్థానం. చీమ ఏనుగు జోక్స్‌తో సమ్ థింగ్ స్పెషల్ అంటూ అనసూయ, రష్మీ, శ్రీముఖి.. లాంటివాళ్లతో పోటీని తట్టుకంటూ క్యూట్ యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్నిపేరు తెచ్చుకుంది. 2017 ఫిబ్రవరి 17న లాస్య, మంజునాథ్ వివాహం జరిగింది. ఏడేళ్ల పాటు సాగిన వీరి ప్రేమ.. పెళ్లి బంధంతో ఒక్కటైంది. చురుకైన యాటిట్యూడ్‌తో ఆకట్టుకొనే.. లాస్య కొన్నాళ్లుగా బుల్లితెరపై కనిపించడం లేదు. పెళ్లి తరువాత యాంకరింగ్‌కి దూరమైన లాస్య ఆ మధ్య ‘రాజా మీరు కేక’ చిత్రంతో వెండి తెరకు పరిచమైంది. మరి బిగ్ బాస్ 4 సీజన్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే కంటెస్టెంట్ యాంకర్ లాస్య అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్స్ ఎంతవరకూ నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.



























