Himaja Mother emotional at her marriage : మోడలింగ్ తో తన కెరీర్ ప్రారంభించిన హిమజ భార్యామణి సీరియల్ ద్వారా బుల్లితెరకు మొదటి పరిచయం అయ్యింది. తర్వాత 2014 లో ప్రసారం అయిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సినిమాలలో కూడా చిన్న క్యారెక్టర్లు చేస్తూ వచ్చింది. అయితే శతమానం భవతి, వున్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి సినిమాలతో పేరు తెచ్చుకోవడమే కాకుండా అభిమానులకు దగ్గర అయింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా హిమజ పాల్గొంది. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనడం వలన హిమజ కు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.

అయితే ఇప్పుడే ఇప్పుడే తన కెరీర్ను గాడిలో పెట్టుకునే క్రమంలో ఉంది హిమజ. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తోంది. అంతేకాకుండా టీవీ ప్రోగ్రాం లలో కూడా కనిపిస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక హిమజ పెళ్లి గురించి అయితే తన పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుందని వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా హిమజ అమ్మకు ప్రేమతో అనే టీవీ షో లో సందడి చేసినట్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో ప్రేక్షకులను అలరిస్తోంది. మదర్స్ డే ని పురస్కరించుకొని అమ్మకు ప్రేమతో ప్రోగ్రాం ప్రసారం కానుంది ఈ ప్రోగ్రామ్ కు జయసుధ ముఖ్య అతిథిగా విచ్చేయగా, నటీనటులు అందరూ వారి వారి అమ్మ తో ఈ ప్రోగ్రామును సందడి చేశారు. ఈ ప్రోగ్రాం కు హిమజ వాళ్ళ అమ్మగారు తోపాటు సందడి చేశారు. వీరికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నీకు తోడు వద్దా…..
మదర్స్ డే పురస్కరించుకొని ఈ ప్రోగ్రాం లో నటీనటులు అందరు వారి వారి అమ్మల తో సందడి చేసి వారికి బహుమతులు ఇచ్చారు. ఈ క్రమంలోనే హిమజ వారి అమ్మగారికి బహుమతి ఇవ్వబోగా.. వాళ్ళ అమ్మ గిఫ్ట్ తీసుకోకుండా నీకంటూ ఒక తోడు ఉంటే బాగుంటుందని అది నువ్వు నాకు ప్రామిస్ చేస్తే నేను గిఫ్ట్ తీసుకుంటాను అని ఎమోషన్ అయ్యారు. దానికి సమాధానం గా హిమజ నాకు కొంచెం టైం కావాలి అని చెప్తూ గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ లోని బంగారు గాజులను చూసే హిమజ వాళ్ళ మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.



























