హిందూ మతం మతం కాదు జీవనశైలి అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ దశ దిశ దుబ్బాక ఎలక్షన్ తో మారిందన్నారు. హిందువునని చెప్పుకునే కేసీఆర్..పనికి మాలిన వారి కోసం హిందువుల పై దాడులు చేయిస్తున్నాడని విమర్శించారు. పరాయి వాన్ని పొలిమేర వరకు తరిమి కొట్టు, మనవాడే మోసం చేస్తే బొంద పెట్టు అన్న కాళోజీ సామెత కేసీఆర్ కు వర్తిస్తుందన్నారు ధర్మపురి అరవింద్.

కాగా ఆర్టికల్ 370 రద్దుతో పండితులు తిరిగి కశ్మీర్ చేరుకున్నారని తెలిపారు. భైంసా మరో కాశ్మీర్ గా మారిందని..కశ్మీర్ మాదిరి గానే భైంసా లో కూడా హిందువులు భైంసా ను వదిలి వెళ్తున్నారని అన్నారు. భైంసా నుండి హిందువులను తరిమి కొట్టే ప్లాన్ ఓవైసీ అధ్వర్యంలో కేసీఆర్ నడిపిస్తున్నారని అన్నారు అరవింద్.



























