ఆ ప్రాంతంలో హోళీ అంటే ఆడవాళ్లు మగాళ్లను కొట్టడమే.. ఇదేం వింత ఆచారమో..!!

0
94

హోలీ పండుగను కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. యావత్ దేశంలో ఉన్న ప్రజలందరూ ఎంతో అంగ రంగ వైభవంగా జరుపుకుంటారు.. అయితే ఒక్కోచోట ఒక్కో రకంగా ఈ హోలీ పండగను సెలెబ్రెట్ చేసుకుంటారు.. హోలీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం.. అయితే ఓ ప్రాంతంలో మాత్రం హోలీ పండుగను చాలా విచిత్రంగా జరుపుకుంటారట.. అందులో బర్సానా అనే ప్రాంతంలో అయితే ఏకంగా కర్రలతో కొట్టుకుంటారు. ఇదెక్కడి వింత సంప్రదాయం అని ఆశ్చర్యపోతున్నారా? అసలింతకీ ఈ కర్రలతో కొట్టుకోవడం ఏంటి? అనేది ఇప్పుడు, తెలుసుకుందాం..

కృష్ణుడి జన్మ స్థలం అయిన మథురలో మరియు బృందావన్లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు మరియు పండుగ చివరి 16 రోజులు, సంప్రదాయక పద్ధతులలో ఆచార వ్యవహారాలతో కృష్ణుడిని పూజిస్తారు.మధుర నుండి 42 కిమి దూరంలో ఉన్నది బర్సానాలో హోలీ రోజుకంటే ముందే హోలి వేడుకలు స్టార్టవుతాయి. ఇక్కడ హోలీ పండుగ కంటే ముందుగా విలక్షణమైన పధ్దతిలో హోలీ వేడుకలు చేసుకుంటారు. దీనినే లాత్ మార్ హోలీ అంటారు. హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. పెద్దగా శ్రీ రాదే లేదా శ్రీ కృష్ణ. హోలీ పాటలను పాడతారు.

బర్సానాలో హోలీ రోజున పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. స్త్రీలు కోపంతో వెళ్లి పురుషులను లాఠీలు అనే పొడవైన కర్రలను ఉపయోగించి కొడతారు. పురుషులు వారి దగ్గర ఉన్న డాలుతో కాపాడుకొంటారు. ఈ ఉత్సవాన్ని అన్ని గ్రామాలు కలసి ఉత్సాహాంగా జరుపుకొంటారు.. ఇక ఈ సంవత్సరం కోవిడ్ మహమ్మారి వల్ల హోలీ సంబరాలు అంతంత మాత్రంగానే జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రా తో పోల్చుకుంటే మన తెలంగాణలోనే ఈ హోలీ సంబరాలను ప్రజలు ఎక్కువగా జరుపుకున్నట్లు సమాచారం..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here