మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక రోజు విధులకు హాజరు కాకపోతే నే ఆఫీస్ నుంచి మనకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. ఈ క్రమంలోనే ఒక వారం రోజుల పాటు ఆఫీస్ కి వెళ్లకుండా ఉంటే విధుల నుంచి మనల్ని బహిష్కరిస్తారు. కానీ ఓ వ్యక్తి గత పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యోగానికి వెళ్లకున్నా అతనిని ఎవరూ గుర్తించలేదు, పైగా నెల నెల అతనికి జీతం కూడా పడుతూనే ఉంది. వినడానికి ఎంతో ఆశ్చర్యం కలిగించే ఈ సంఘటన ఇటలీలోని పుగ్లీసీ సియాసియో ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాటాన్జారోలోని కాలాబ్రియన్ నగరంలో ఉన్న ఈ ఆసుపత్రిలో 2005వ సంవత్సరం నుంచి ఓ వ్యక్తి విధులకు హాజరు కావడం లేదు. ఈ వ్యక్తి విధులకు హాజరు కావడం లేదనే విషయాన్ని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ గుర్తించలేకపోయింది. అతడు విధులకు రాకున్నా, అటెండెన్స్ మాత్రం ఉండేది. ఈ విషయంపై ఆరా తీసిన అధికారులు అతడు కొన్ని విధానాలను పాటించాడని తెలుస్తోంది. అసలు విషయం బయట పడటంతో ఆ వ్యక్తి తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆసుపత్రి యాజమాన్యాన్ని బెదిరించినట్లు తెలుస్తోంది.

తాజాగా ఆ డైరెక్టర్ పదవి విరమణ పొంది ఆ స్థానంలో
హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ అతడి అటెండెన్సులో లోపాలను గుర్తించలేకపోయింది. ఫలితంగా గత 15 సంవత్సరాల నుండి ప్రతి నెల జీతం పడుతూ ఉంది. 15 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి సుమారుగా రూ.4.85 కోట్ల రూపాయల జీతం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ విషయం బయట పడటంతో అధికారులు అతనిని విధుల నుంచి బహిష్కరించారు. అదేవిధంగా ఆస్పత్రిలో ఉన్న ఆరుగురు హెచ్ఆర్ లను ఆరా తీస్తున్నారు. ఇందులో కచ్చితంగా ఎవరో ఒకరి సహాయ సహకారం లేనిదే ఆ వ్యక్తి ఇటువంటి దారుణానికి పాల్పడ్డారని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఆ నిందితుడి వయస్సు 67 సంవత్సరాలు కాగా అతనికి కోర్టు ఏమైనా శిక్షను విధిస్తుందా లేకపోతే అతడు విధులకు హాజరు కాకపోయినా ప్రతి నెల జీతం చెల్లిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రినుంచి జరిమానా వసూలు చేస్తుందనే విషయం తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here