‘సొంతం’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ నమిత. మొదట్లో సన్నగా నాజూకుగా, కరెంట్ తీగలా ప్రేక్షకులను మురిపించిన నమిత మెల్ల మెల్లగా బరువు పెరిగింది. ఊహించని ఆ బొద్దు తనంతో టాలీవుడ్ చిత్రాలకు దూరమైంది. కానీ తమిళంలో మాత్రం మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. తమిళ తంబీలకు బొద్దు గుమ్మలంటేనే ఇష్టం కాబట్టి, అక్కడ ఫుల్ బిజీ అయిపోయింది నమిత.

ఆ తర్వాత మల్లువుడ్ కు చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నమిత ప్రస్తుతం కోలీవుడ్ లో ‘అహంభావం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటు తెలుగు నుండి, అటు మలయాళం, కన్నడ నుండీ కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. కానీ అవన్నీ గ్లామర్ రోల్సే కావడంతో ఒకప్పుడు విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్ చేసేసి, గ్లామరస్‌గా తన అందాలను ఆరబోసిన నమిత పెళ్లైన తర్వాత గ్లామర్ రోల్స్ లో నటించకూడదని గట్టి నిర్ణయమే తీసుకుందట. అందుకనే తాజాగా డిగ్నిఫైడ్ రోల్స్‌లోనే నటిస్తానంటోంది. విలన్ పాత్రలైనా చేస్తానంటుంది. అన్నింటికీ మించి అసలైన ట్విస్ట్ ఏమిటంటే..

ప్రస్తుతం నమిత తన ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. ఇప్పటికే 20 కేజీల బరువు తగ్గి ఫ్యాన్స్ అందరికీ షాకిచ్చింది. ఫ్యూచర్ లో ఇంకా బరువు తగ్గుతానంటోంది ముద్దు గుమ్మ. అధిక బరువు కారణంగానే గతంలో ఎన్నో టాలీవుడ్ ఆఫర్లను మిస్సైంది నమిత. అందుకే ఇకపై బరువు పెరగకుండా వుండటానికి ఫిజిక్‌పై పూర్తి శ్రద్ధ వహిస్తానని చెబుతోంది అందాల నమిత. So.. ఈ లెక్కన నమితను త్వరలోనే తెలుగులో మంచి రోల్స్‌లో చూడబోతున్నామన్న మాట.!



























