అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ అక్కినేని. “అఖిల్” సినిమాతో తెలుగులో హీరోగా అరంగేట్రం చేసిననాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హిట్ అందుకోలేకపోయినా పట్టువదలని విక్రమార్కుడిలా హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినా ఈ కుర్ర హీరోకు అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు. అయితే తాజగా ఒక టీవీ యాంకర్ నోరుజారి చేసిన వ్యాఖలు అందరినీ షాక్ కి గురిచేశాయి. వివరాల్లోకి వెళితే..

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ షోలో పాల్గొంది. ఇదే ప్రోగ్రాం లో గెస్టులుగా యాంకర్ శ్రీముఖి, మాజీ యాంకర్ లాస్య, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ లు కూడా పాల్గొన్నారు. అయితే ప్రోగ్రాం మధ్యలో ముక్కు అవినాష్ స్వయంవరం పేరుతొ ఒక స్కిట్ చేసారు. విష్ణుప్రియ నాకు సెట్ అవదు అంటూ ముక్కు అవినాష్ చేసిన కామెంట్ కు విష్ణుప్రియ రెస్పాండ్ అవుతూ..”హమ్మయ్య అఖిల్ వైటింగ్ నాకోసం..” అనేసి నాలిక కరుచుకుంది.

విష్ణుప్రియ “పోరా..పోవే..” ప్రోగ్రాం ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి హీరోయిన్ గా ట్రై చేసినా ఈ అమ్మడుకి అవకాశాలు దక్కకపోవడంతో ఒక పక్క మోడలింగ్ చేసుకుంటూ.. మరో పక్క యాంకర్ గా రాణిస్తోంది. అయితే ఈ అమ్మడు వెండితెరపై కనిపించడం కోసం చాలా ఉత్సాహంగా ఉందట. అవకాశాల కోసం పరితపిస్తోందట. అందుకే అఖిల్ ను టార్గెట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. అఖిల్ తనకు క్లోజ్ అనే ఉద్దేశం వచ్చేలా వ్యాఖలు చేస్తూ అవకాశాలకోసం భారీ ప్లాన్ వేసిందని అనుకుంటున్నారు.

క్యాష్ ప్రోగ్రాం మీకోసం 20:20 ఫ్రేంలో మీరు చూడవచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here