House In Ala Vaikuntapuramulo Movie: అలా వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప సినిమా కంటే ముందే మంచి విజయాన్ని ఇచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఇందులోని పాటలు ఆకట్టుకున్నాయి. రీల్స్, టిక్ టాక్ లలో ఈ పాటలతో అందరూ సందడి చేసారు. బాక్స్ ఆఫీస్ వద్దనే కాదు బుల్లితెర మీద కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. జెమినీ టీవీ లో ఈ సినిమాను ప్రసారం చేయగా ఏ సినిమాకూ రానంతగా 28 టీఆర్పితో రికార్డు సృష్టించింది. ఇక ఇందులో మరో హైలెట్ గా ఇల్లు అందరినీ ఆకట్టుకుంది.

అది సెట్టు కాదు… నిజమైన ఇల్లే…
ఈ సినిమాలో వాడిన ఇంద్రభవనం లాంటి ఇల్లును చూసి అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ ఇంటిని మొదట అందరు సెట్టు అయ్యి ఉంటుందని భావించారు. మీరు కూడా అలాగే అనుకోని ఉంటే పప్పులోకాలేసిసినట్టే. అవును ఆది నిజమైన ఇల్లే. ఆ ఇల్లు ఎన్ టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారి కుమార్తె అయిన రచన చౌదరి భర్త ఇల్లు అంట. మొదట ఈ సినిమాకోసం దర్శకుడు త్రివిక్రమ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక సెట్టు వేయాలని అనుకున్నారట. అందుకు అల్లు అర్జున్ నరేంద్ర చౌదరి గారి ఇల్లు ఖాళీగా వుంది కదా అది వాడుకుందాం అని సలహా ఇవ్వడం తో ఆ ఇంటిని ఫిక్స్ అయ్యారు.

తరువాత వారితో మాట్లాడి అద్దెకు తీసుకోవడం జరిగిందట. అయితే ఈ ఇల్లు సినిమాకి మరో హైలెట్ అనడం లో అశ్చర్యపోనవసరం లేదు. ఈ ఇల్లు ఖరీదు తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఈ ఇంటి ఖరీదు అక్షరాల 400 కోట్లు ఉంటుందని సమాచారం. హైదరాబాద్ లో వున్న అత్యంత ఖరీదైన అందమైన ఇళ్లల్లో ఇది ఒక్కటి.



























