House Of Manchus : సినిమాల్లో ప్రేక్షకులు అనుకున్న దానికి భిన్నంగా కథ సాగినపుడు థ్రిల్ కి గురవ్వుతారు. ట్విస్ట్ అదిరింది అని సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రాంక్ ల పేరుతో సోషల్ మీడియాలో రోడ్డు మీదే కొట్టుకుని చివరికంతా తూచ్ ఇదంతా ప్రాంక్ అంటున్నారు. అందుకే ఈమధ్య సోషల్ మీడియాలో వచ్చేవి ఏవి నిజమో ఏవి అపద్దమో కూడా తెలియడం లేదు. అయితే ఇలాంటి ట్విస్ట్ ఇప్పుడు మన మంచు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇచ్చింది. మంచు ఫ్యామిలీ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. మనోజ్ రెండో పెళ్లి దగ్గరి నుండి ఈ ఫ్యామిలీ తెగ వైరల్ అవుతోంది.

గొడవ అంతా తూచ్.. అదంతా షో కోసం…
మంచు విష్ణు కి, మంచు మనోజ్ రెండో పెళ్లి ఇష్టం లేదని అప్పటి నుండి వీరి మధ్య బేదాభిప్రాయాలు ఎక్కువయ్యాయి అంటూ వార్తలు వినిపించాయి. అంతే కాక విష్ణు, మనోజ్ సన్నిహితుడి మీద దాడి చేయడం, ఆ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో గొడవ నిజంగానే ఉందని విష్ణు, మనోజ్ ల మధ్య గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో బాగా చర్చలు మొదలయ్యాయి. అయితే ఆ వీడియో అంతా తూచ్, అదంతా షో కోసం అంటూ హౌస్ అఫ్ మంచూస్ షో త్వరలో రాబోతోంది అంటూ విష్ణు తన సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ వదిలాడు.

అమెరికన్ మోడల్ కిమ్ కాదర్షియన్ నిర్వహించిన ‘ది కాదర్షియన్ షో’ లాగా ‘ది హౌస్ అఫ్ మంచూస్’ పేరుతో రియాలిటీ షోని ప్లాన్ చేశారట మంచు ఫ్యామిలి. మొన్న జరిగిన గోడవ ఈ షో ప్రమోషన్స్ కోసమే అంటూ చెప్పుకొచ్చారు. బాగానే కవర్ చేసారు అంటూ కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతుంటే మరి కొంతమంది మాత్రం మరీ షో కోసం ఇలా చేయాలా అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఏం చేసినా వెరైటీ గా చేసే మంచు ఫ్యామిలీ ఈ షో ఇంకెంత వెరైటీ గా చేస్తుందో చూడాలి.



























