అసలు చిరంజీవి, సురేఖల పెళ్ళి ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!

0
1036

మెగాస్టార్ చిరంజీవీ అంటే టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ అందరికీ తెలుసు. కానీ ఆయన భార్య సురేఖ గురించి చాలా కొద్దిమందికే తెలుసు. అసలు వీళ్ళిద్దరి పెళ్ళి ఎలా జరిగిందో తెలిస్తే చిరు ఫ్యాన్స్ ఖచ్ఛితంగా ఆశ్చర్యపోతారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ఆద‌ర్శ దంప‌తులని టాలీవుడ్ ప్రముఖులందరికీ తెలిసిందే. వాళ్లిద్ద‌రి వైవాహిక జీవితం పూర్తయ్యి 40 ఏళ్లైంది.. అయితే తాజాగా చిరు, సురేఖల జీవితాల్లోని అనేక ఆసక్తికరమైన విశేషాల‌ను మెగాస్టార్ చిరంజీవి దంపతులిద్దరూ ఇటీవలే మీడియాతో తమ వైవాహిక దాంపత్య ముచ్చట్లను షేర్ చేసుకున్నారు. అస‌లు సురేఖ‌తో తన పెళ్ళి ఎలా జరిగిందో ఆయ‌న స‌ర‌దాగా చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే..

ఈమధ్యనే ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారు తన పెళ్ళినాటి జ్ణాపకాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. త‌న క్లాస్‌మేట్ స‌త్య‌నారాయ‌ణ ఒక‌రోజు అనుకోకుండా చెన్నై కోడంబాకం బ్రిడ్జి దగ్గర క‌నిపించ‌డంతోనే త‌న జీవితంలోకి సురేఖ ప్ర‌వేశించినట్టు.. త‌న క్లాస్‌మేట్‌కు అల్లు రామ‌లింగ‌య్య గారు పెద‌నాన్న అవుతాడ‌ని, సత్యన్నారాయణను తన కారులో దింపెందుకు అల్లు వారింటికి వెళ్లినప్పుడే వాళ్ళ కుటుబంతో తొలి పరిచయమైందని.. ఆ రోజుల్లో అల్లు రామ‌ లింగ‌య్య‌ గార్కి త‌న కూతురిని ఓ ఐఏఎస్ ఆఫీస‌ర్‌కి ఇవ్వాల‌ని కోరిక వుండేదని అని.. కానీ అల్లు అర‌వింద్ గారి బ‌ల‌వంతంతో త‌న గురించి విచారించార‌ని చెప్పారు. వాళ్ల విచార‌ణ‌లో త‌న‌కు ఏ చెడు అల‌వాట్లు లేవ‌ని, ఆంజ‌నేయ‌స్వామి భ‌క్తుడిన‌ని, బాగా చ‌దువుకోవ‌డంతో పాటు బాగా క‌ష్ట‌ప‌డ‌తాన‌నే మంచి గుర్తింపు రావడంతో అల్లు అర‌వింద్‌ కుటుంబం వెంటనే త‌నకి సురేఖనిచ్చి పెళ్లి చేయ‌డానికి నిశ్చ‌యించుకున్నార‌ని చిరంజీవి వివ‌రించాడు.

కానీ ఈ పెళ్ళి జరగకముందే అల్లు రామలింగయ్య గారు తన గురించి ప‌ది మంది నిర్మాత‌ల‌ను అడిగి పూర్తి వివరాలను సేకరించి.. వారి స‌ల‌హా తీసుకున్న తర్వాతే త‌మ పెళ్లికి ఓకే చెప్పారని.. అలా త‌న‌ను అల్లు వారి ఇంటల్లుడైనట్లుగా చిరంజీవి వివ‌రించారు. ‘మన వూరి పాండవులు’ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని చూసిన సురేఖ ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు అనుకున్నాను. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుంటే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నాను’ అని సురేఖ గారూ తన గత మ‌ధుర స్మృతుల‌ను నెమ‌రు వేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా తన పెళ్ళి సంగతులను గుర్తు చేసుకుంటూ.. సురేఖతో తన పెళ్లి చూపులు జరిగినప్పుడు వాళ్ళిద్దరినీ మనసు విప్పి మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లార‌ని, అయితే అంత‌కు ముందు అమ్మాయిల‌తో పెద్ద‌గా ప‌రిచ‌యాలు లేక‌పోవ‌డంతో కాస్త ఇబ్బంది ప‌డ్డాన‌ని, కానీ ఆ సమయంలో సురేఖ నడవడిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అని నిశ్చయించుకున్నానని… చిరు అమ్మగారికి కూడా సురేఖ బాగా నచ్చిందని.. ఇక చిరంజీవి నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అని తనని ఆదేశించినట్లు మెగాస్టార్ చిరంజీవి అలనాటి విశేషాల‌ను వివరించారు.

చిరంజీవి కుటుంబ స‌భ్యులంతా  త‌న‌తో చాలా బాగుంటారని, ఏ బంధమైనా ఇరువైపులా ఉండాల‌ని, చిరంజీవి లేక‌పోయినా పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడూ పిల్లలతో సరదాగా ఉండేవాడని అందుకే కల్యాణ్‌ పిల్లలతోపాటు పెరిగాడని, పిల్లలు కల్యాణ్‌తో పాటు పెరిగారని సురేఖ చెప్పడం విశేషం.. ఈ ఇంటర్వ్యూను కొనసాగిస్తూ చిరంజీవి తాను ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు మొదలయ్యాయని, ఆల్బమ్‌ పట్టుకుని సినిమా ఛాన్స్ ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదని, పెళ్లినాటికే ఫామ్‌లో ఉన్నాన‌ని, ఆ సమయంలో సురేఖకు తాను కనబడటమే అపురూపమ‌ని, కానీ మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్‌ తగ్గింద‌ని సురేఖ‌పై ‘చిరు’ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఏ సందర్భంలోనైనా తాను సురేఖను పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుందే త‌ప్ప‌, వచ్చి చూడదని, అందుకే లేటు వయసులో చాలామంది సెకండ్‌  కోసం చూస్తుంటారని నవ్వుతూ, సురేఖ వైపు కొంటెగా చూస్తూ ఆట ప‌ట్టించారు మెగాస్టార్. చిరంజీవి మాటలకు సురేఖ న‌వ్వుతూ చిరు వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు. వాళ్ల సంభాష‌ణ‌ల్లో ఎక్క‌డా దాప‌రికం క‌నిపించ‌లేదు. అందుకే 4 ద‌శాబ్దాల వైవాహిక జీవితంలో ఎలాంటి అర‌మ‌రిక‌లు లేకుండా సుఖ‌సంతోషాల‌తో జీవిస్తున్నార‌నిపించింది. అదండి సంగతి.. చదివారుగా.. చిరంజీవి గారితో సురేఖ పెళ్ళి ఎలా జరిగిందో.. మరి మీరూ కూడా మీ పెళ్ళి ఆల్బమ్ ను తిరగేస్తూ గత జ్ణాపకాలను గుర్తు చేసుకోండి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారుగా పెద్దలు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here