ఆడపిల్లలు ఎంత త్వరగా ఎదిగిపోతారో కదా.. చూస్తుండగానే పెద్దోళ్ళు అయిపోతారు. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వెంకటేష్ “దృశ్యం” చిత్రంలో వెంకటేష్ కి చిన్న కూతురుగా నటించిన పాప గుర్తుందా.. ఆ పాప పేరే “ఎస్తేర్”. ఆ సినిమాలో తన అద్భుతమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దృశ్యం సినిమా 2014 సంవత్సరంలో వచ్చింది. ఆ సమయానికి ఆమె వయస్సు 12 సంవత్సరాలు. అయితే ఈ సినిమా వచ్చి ఇప్పటికి ఆరేళ్ళు దాటిపోయింది.

తాజాగా ఎస్తేర్ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ఫోటోలు చూస్తున్న నెటిజన్లు అప్పుడే ఎంతగా ఎదిగిపోయింది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్తేర్ వయస్సు 18 ఏళ్ళు, ఇప్పుడు ఎస్తేర్ ను చూస్తుంటే హీరోయిన్ లా మారిపోయింది. ఆరేళ్లలో ఎంత మార్పు.. తాజగా హాట్ హాట్ గా తయారైన ఎస్తేర్ చూస్తుంటే అందరు షాక్ అవుతున్నారు. అయితే త్వరలో మలయాళంలో ఈ ముద్దుగుమ్మ యుంగ్ హీరోల సరసన హీరోయిన్ గా నటించడానికి సిద్దమవుతుంది. త్వరలో తెలుగులో కూడా నటిస్తుందేమో వేచిచూడాలి…






























