ఇమ్యూనిటీకి ఎంత అవసరమో ఇప్పుడున్న పరిస్తుతుల్లో ప్రతిఒక్కరికీ బాగా అర్ధమయింది. ప్రస్తుతం ఈకోవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఇమ్యునిటీ కోసం ఇప్పటికే చాలా మంది పలురకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రోగనిరోధకత గురించిన అవగాహన చాలా అవసరం.

ఇప్పటికే కరోనా థర్డ్‌వేవ్ తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.. ఇందులో నిజమెంత ఉందో ఎవరికీ తెలియదు కానీ ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు పిల్లలను సిద్దం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా కాపాడుకోవచ్చునని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వారు తీసుకుంటున్న అహారంలో తగిన మార్పులు, చేర్పులు చేయాలని, రోగ నిరోధకశక్తి ని పెంచే ఆహార పదార్దాలు వారికి ఎక్కువగా ఇవ్వాలని చెబుతున్నారు.
ఇమ్యునిటీని పెంపొందించడంలో ఆహారం, ఆటపాటలు, నిద్రించే సమయం కీలకపాత్ర పోషిస్తాయని తెలుస్తుంది. ఇక పిల్లల విషయానికి వస్తే వారు అన్నీ ఇష్టంగా తినరు. అందువల్ల వారు ఇష్టపడే ఆహారంలో అవసరమైనవి కలిపి తినిపించాలి. మాంసకృత్తులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారాలను వండి పెట్టాలి. వీటిలో ఇటువంటి వంటకాలు ప్రయత్నిచండి.
చికెన్ + తోటకూర/మెంతికూర ► మటన్ + గోంగూర/ ములక్కాయ/తోటకూర ► ఎగ్ ప్యాండర్+ గ్రీన్‌పీస్ మసాలా ► రాజ్‌మా రైస్+ సోయా చంక్స్ మసాలా ► మింట్ రైస్+ మిక్స్‌డ్ వెజ్ కర్రీ ► బగారా రైస్+ పాలక్ పనీర్ ► జీరా రైస్+ దాల్ ఫ్రై, కర్డ్ రైతా ► మిల్లెట్ బిసిబిల్లా బాత్ ► మిక్స్‌డ్ వెజ్ సాంబార్+బీన్స్ ఫ్రై, ► టొమాటో కార్న్, మిక్స్‌డ్ వెజ్/మష్రూమ్/చికెన్ సూప్































