Digital Payment Apps: డిజిటల్ టెక్నాలజీ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా.. స్మార్ట్ ఫోన్లతోనే పనులు అన్నీ జరిగిపోతున్నాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మొత్తం దేశాన్ని డిజిటల్ వైపు అడుగులు వేసే దిశగా బడ్జెట్ లో ప్రస్తావించారు.

అందులో భాగంగానే రైతులకు డ్రోన్లతో పాటు.. చదువుకునే విద్యార్థులకు ఫోన్లను సమకూర్చనున్నట్లు తెలిపారు. అయితే పెద్ద నోట్లు రద్దు అయిన దగ్గర నుంచి కూడా ప్రతీ ఒక్కరి మొబైల్ ఫోన్లలో డిజిటల్ పేమెంట్ యాప్ లు ఉంటున్నాయి.

డిజిటల్ కరెన్సీని వాడాలని.. ఫిజికల్ కరెన్సీని తగ్గించాలని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా డిజిటల్ పేమెంట్ యాప్ లల్లో ఉపయోగించేవి పేటీఎం, ఫోన్ పే మరియు గూగుల్ పే. వీటిని ఉపయోగించి ఎక్కువ శాతం డబ్బులను ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.
కమీషన్ బేస్ ద్వారా వాళ్లు డబ్బులను …
అయితే వీటి ద్వారా ఇలా ట్రాన్సా క్షన్స్ చేస్తే వీటికి వచ్చే లాభం ఏంటి అనేది ప్రతీ ఒక్కరికీ కలిగే ప్రశ్న. దాని గురించి తెలుసుకుందాం. ఈ యాప్ ల నుంచి ఎన్నో రకాల సేవలను పొందొచ్చు. అందులో ముఖ్యంగా మొబైల్ రీచార్జ్. యాప్ నుంచి రీచార్జ్ చేసుకుంటే టెలికాం కంపెనీ వాళ్ళు కమీషన్ ఇస్తారు. టీవీ రీచార్జ్ లు అయినా సరే అంతే ఉంటుంది. హోటల్ బుకింగ్స్ చేసుకున్నా సరే కమీషన్ వస్తుంది. ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇలా కమీషన్ బేస్ ద్వారా వాళ్లు డబ్బులను సంపాదిస్తుంటారు. పలు కంపెనీలు ఇచ్చే కూపన్ల ద్వారా కూడా మనీ సంపాదిస్తుంటాయి. ఇలా ఆ కూపన్ ఆధారంగా కొనుగోలు చేసినా సరే కొంత కమీషన్ ఇస్తారు. ప్రతీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చొకొని.. కమీషన్లను పొందుతారు. ఇక ఇలా యాప్ లను ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఆ రకంగా కూడా మనీ సంపాదిస్తుంటారు.
































